పెళ్లిరోజే శర్వానంద్ తో అసౌకర్యానికి గురి ఐనా అతని భార్య...!!
హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి పీటలు ఎక్కిన ఈ జంట పెళ్లిలో చాలా ఎంజాయ్ చేశారు. ఇక వీరి పెళ్లికి వచ్చిన ఎంతోమంది సెలబ్రిటీలు,బంధువులు, సన్నిహితులు అందరూ ఈ జంటను చూసి సంతోషపడ్డారు.. ఈ విషయం పక్కన పెడితే శర్వానంద్ పెళ్లి మండపంలోనే తన భార్యతో ఆ విషయంలో గొడవ పడ్డారు అంటూ తాజాగా ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే పెళ్లి మండపంలోనే గొడవ పడ్డారు అంటే అది పెద్ద గొడవ కాదు.
కొత్తగా పెళ్లయిన భార్యాభర్తల మధ్య ఉండే సరసాల గొడవ. ఇక అసలు విషయం ఏమిటంటే.. శర్వానంద్ రక్షిత రెడ్డి ఇద్దరు ఫొటోస్ దిగేటప్పుడు శర్వానంద్ తన భార్యని ప్రతిసారి ఇలా పోజ్ పెట్టు అలా పోజ్ పెట్టు అని ఫోటోగ్రాఫర్ కంటే ఎక్కువగా ఈయనే చెప్పారట.అంతేకాకుండా అంతమందిలో ఈయన తన భార్యపై ఎక్కువగా కేర్ తీసుకోవడంతో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారట. అయితే ఈ విషయంలో కాస్త అసౌకర్యంగా ఫీల్ అయిన రక్షిత రెడ్డి ఏంటి ఇదంతా ఎవరైనా చూస్తే ఓవర్ అనుకుంటారు అనే తీరుగా తన ఫేస్ పెట్టి శర్వానంద్ ని కాస్త కోపంగా చూసిందట.
అయినప్పటికీ శర్వానంద్ తనని పట్టించుకోకుండా ఫోటోగ్రాఫర్ల ఫోజులు చెబుతూ దిగమని చెబుతుండడం చూసినా అక్కడ వాళ్ళు వీళ్ళిద్దరిని చూసి ఆశ్చర్య పోయారట.అంతేకాదు పెళ్లిలోనే ఇలా కండిషన్లు పెడుతున్నారు పెళ్లయ్యాక భార్యకి ఇంకెన్ని కండిషన్లు పెడతారో అంటూ కొంతమంది ఈ విషయం తెలిసిన నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.