సాయిధరం తేజ్ అలా చేయడం తప్పంటున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్...!!
తాను ఒక్క పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి అని, తనకు నాలుగైదు హిట్స్ ఉన్నాయి కదా అని పొగరు చూపియ్యడం వంటివి ఇప్పటి వరకు చెయ్యలేదు. బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన హీరో గా నటించిన 'విరూపాక్ష' చిత్రం ఈ సమ్మర్ కానుకగా విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మాత్రమే కాదు, ఈ ఏడాది లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో కలిసి 'బ్రో ది అవతార్' అనే చిత్రం లో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఒక్కటే బ్యాలన్స్ ఉంది. అది ఇప్పుడు హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లో సాయి ధరమ్ తేజ్ కి తన మ్యానేజర్ సతీష్ తో లొకేషన్ లో పెద్ద గొడవలు అయ్యాయట. ఎందుకు వీళ్ళ మధ్య గొడవలు జరిగాయి అనేది తెలియదు కానీ, సాయి ధరమ్ తేజ్ ఈ గొడవ లో కాస్త అదుపు తప్పి సతీష్ చెంప పగలగొట్టాడట. సతీష్ కూడా తిరిగి కొట్టబోగా, యూనిట్ సభ్యులు మొత్తం సతీష్ ని బలవంతంగా బయటకి తీసుకెళ్లి సెక్యూరిటీ తో బాగా కుమ్మించి అతనిని ఉద్యోగం నుండి తీసి వేసారట. సోషల్ మీడియా లో బ్రో కి సంబంధించిన ప్రతీ కార్యక్రమం సతీష్ ఆద్వర్యం లోనే జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఈ సినిమా నుండి తప్పుకోవడం తో , ఈరోజు విడుదల అవ్వాల్సిన ఈ సినిమా టీజర్ వాయిదా పడింది. ఇక ఈ టీజర్ ఎప్పుడు విడుదల అవ్వుద్దో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాని కూడా కొనుగోలు చేసింది. ఈ చిత్రం ఈనెల 16 వ తారీఖున విడుదల కాబోతుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ అయిపోయింది టీం మొత్తం. దీంతో 16 వ తారీకు దాటితే కానీ 'బ్రో ది అవతార్' టీజర్ వచ్చే అవకాశం లేదని అంటున్నారు.ఇదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం కి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ బలి అవ్వక తప్పదు. ఇదంతా కేవలం సాయి ధరమ్ తేజ్ వల్లే జరిగింది. ఆయన కాస్త కంట్రోల్ గా ఉండిఉంటే అన్నీ సజావుగా సాగేది, ఎప్పుడు ఎంతో కూల్ గా ఉండే సాయి ధరమ్ తేజ్, ఇలా టెంపర్ లాస్ అవ్వడానికి కారణం ఏంటో తెలియాల్సి ఉంది.