లియో.. భారీ ధరకె ఫ్రీ రిలీజ్ బిజినెస్..!!

Divya
కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు పొందిన విజయ్ దళపతి డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వస్తున్న చిత్రం లియో.. ఈ చిత్రం విజయ్ దళపతి 67వ ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అంటూ షాంపులుగా టైటిల్ ప్రోమో అని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రీగా వినిపిస్తున్న లియో సినిమా డిజిటల్ సాటిలైట్ రైట్స్ ని కూడా అమ్ముడుపోయాయని సెవెన్ స్క్రీన్ స్టూడియో వెల్లడించడం జరిగింది.

డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోక సాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమా రూ .400 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా కేరళ హక్కులను శ్రీ గోకులం మూవీస్  రూ.16 కోట్ల రూపాయలకు ఆల్ టైం రికార్డు ధరకు దక్కించుకోవడం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ సినిమాలలోని ఈ సినిమా ఆల్ టైం అత్యధికంగా అమ్ముడుపోయిన సినిమాగా పేరు సంపాదిస్తోంది. దీంతో ఈ సినిమా థియేటర్ రైట్స్ ఊహించని విధంగా అమ్ముడుపోయినట్టే అంటూ ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.

లియో చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయమని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్.. యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు ప్రియ ఆనంద్ ,గౌతమి వాసుదేవ్ మీనన్, సాండి ఇతర కీలకమైన పాత్రల నటిస్తున్నట్లు తెలుస్తోంది సంగీతాన్ని అనిరుద్ అందిస్తూ ఉన్నారు. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి మరి. చివరిగా విజయ్ దళపతి వారీసు చిత్రం ద్వారా పరవాలేదు అనిపించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: