యాత్ర 2 ను నిర్మించబోతున్న యూవీ క్రియేషన్స్..!!

murali krishna
టాలీవుడ్ లో టాప్ లీడింగ్ లో ఉన్న అతి తక్కువ ప్రొడక్షన్ హౌస్ లలో  యూవీ క్రియేషన్స్ కూడా ఒకటి.ప్రముఖ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన అన్నయ్య ప్రభోద్ మరియు స్నేహితులతో కలిసి ఈ సంస్థ ని స్థాపించారని తెలుస్తుంది.
మొదటి సినిమాగా శర్వానంద్ ని హీరో గా పెట్టి 'రన్ రాజా రన్' అనే చిత్రాన్ని అయితే తీశారు. శర్వానంద్ కెరీర్ లో మొట్టమొదటి కమర్షియల్ హిట్ సినిమా ఇదే. ఈ సినిమా తర్వాత యూవీ క్రియేషన్స్ ప్రభాస్ తో మిర్చి సినిమాని కూడా తీశారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ కూడా తెలిసిందే. అంతే కాదు ప్రొడక్షన్ వాల్యూస్ ని అద్భుతంగా మైంటైన్ చేసినందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ కి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చాయి. ఈ సినిమా తర్వాత గోపీచంద్ తో జిల్, అనుష్క తో భాగమతి వంటి సూపర్ హిట్స్ ని కూడా అందుకుంది ఈ సంస్థ.
అయితే గత కొంతకాలం నుండి ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న సినిమాలన్నీ కూడా బెడిసి కొట్టేస్తున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ ఈ సంస్థ లో 'సాహూ' మరియు 'రాధే శ్యామ్' వంటి చిత్రాల ను తీశారు. ఈ రెండు సినిమాలు పెద్ద ఫ్లాప్ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీళ్ళు త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ 'యాత్ర - 2' చిత్రాన్ని గ్రాండ్ లెవెల్ లో నిర్మించబోతున్నారని సమాచారం.. సరిగ్గా 2019 ఎన్నికల సమయం లో మహి వి రాఘవ్ అనే దర్శకుడు 'యాత్ర' అనే చిత్రాన్ని తీసాడు. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని తెలుస్తుంది.. అప్పట్లో ఈ సినిమా కమర్షియల్ గా కూడా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా, జగన్ కి ఎన్నికల్లో బాగా ఉపయోగ పడింది. మొదటి భాగం లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రని ములాయం మెగాస్టార్ మమ్మూటీ పోషించాడు. ఇప్పుడు రెండవ భాగం లో జగన్ పాత్రని ప్రముఖ తమిళ హీరో జీవ పోషించబోతున్నాడని తెలుస్తుంది.. అయితే ఈ సినిమా నిర్మాణం లో ఇప్పుడు ప్రభాస్ కి సంబంధించిన సంస్థ ఇన్వాల్వ్ అవ్వడం ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతం లో జగన్ సోదరి షర్మిల ప్రభాస్ ని హీరో గా పెట్టి 'యోగి' అనే చిత్రాన్ని కూడా చేసింది. ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది కానీ, అప్పటి నుండి వై ఎస్ కుటుంబం తో ప్రభాస్ కి మంచి సాన్నిహిత్యం అయితే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు జగన్ బయోపిక్ ని నిర్మించేందుకు ప్రభాస్ నిర్మాణ సంస్థ ముందుకొచ్చిందని అయితే అంటున్నారు ఫ్యాన్స్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: