ఓటీటీ లో బాగా దూసుకుపోతున్న ఉగ్రం...!!

murali krishna
అల్లరి నరేష్ అప్పట్లో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఎలాగో, నేటి తరానికి కామెడీ హీరో గా అల్లరి నరేష్ అలా బాగా పాపులర్ అయ్యాడు.
కామెడీ సినిమాలు చేసే ఈ హీరో ఇప్పుడు వరుసగా సీరియస్ రోల్స్  ను చేస్తున్నాడు. 'నాంది' సినిమా నుండి సరికొత్త నరేష్ కనిపిస్తున్నాడు.. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యి నరేష్ కి మంచి పేరు ప్రఖ్యాతలు ను తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత 'మారేడుమల్లి నియోజగవర్గం  అనే సినిమా తీసాడు కానీ, అది పెద్దగా ఆడలేదు. కానీ అల్లరి నరేష్ కి మాత్రం మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఆయన 'ఉగ్రం'అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ గా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా అయితే నిల్చిం ఈ మధ్యనే ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేసారు, రెస్పాన్స్ ఊహించిన దానికంటే అద్భుతంగా అయితే వచ్చింది.చూసిన ప్రతీ ఒక్కరు కూడా కచ్చితంగా ఈ సినిమాని చూడాల్సిందే అని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. ఇంత మంచి సినిమాకి నెగటివ్ రివ్యూస్ రాయడానికి మనసు ఎలా వచ్చిందంటూ రివ్యూయర్స్ ని తిడుతున్నారుటా ప్రేక్షకులు. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ రేటు కి కొనుగోలు చేసింది. అయితే వాళ్ళు పెట్టిన డబ్బులు కేవలం మొదటి రోజులోనే ఈ చిత్రం రికవర్ చేసిందని అయితే అంటున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకి వంద మిలియన్ కి పైగా వాచ్ మినిట్స్ వచ్చాయని తెలుస్తుంది.. ఇది అల్లరి నరేష్ కెరీర్ లో హైయెస్ట్ వ్యూస్ అని కూడా చెప్తున్నారు. అంతే కాదు ఆల్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా కొన్ని బాలీవుడ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను కూడా పక్కకి నెట్టి టాప్ 2 స్థానం లో ట్రెండ్ అవుతుందని సమాచారం.ఈ చిత్రం అల్లరి నరేష్ కి బాక్స్ ఆఫీస్ పరంగా అంతగా ఉపయోగపడి ఉండకపోవచ్చు కానీ, ఓటీటీ పరంగా మాత్రం బాగా ఉపయోగ పడింది అనే చెప్పవచ్చు.. ఈ సినిమా ద్వారా ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నే దగ్గరయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: