అడల్ట్ వీడియోలు చూడమని టార్చర్ చేస్తున్నాడని నటి వాఖ్యలు....!!

murali krishna
కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి జోడీగా గుర్తింపు తెచ్చుకున్న జోడీలలో సంయుక్త విష్ణుకాంత్ జోడీ ఒకటనే సంగతి తెలిసిందే. విష్ణుకాంత్ సంయుక్త ప్రేమించి పెళ్లి చేసుకోవడం గమనార్హం.
అయితే ఎంతో ఇష్టపడి కష్టపడి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లైన రెండు నెలలకే విడిపోవడం గమనార్హం. విష్ణుకాంత్ సంయుక్త ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం వార్తల్లో నిలిచారు. మొదట విష్ణుకాంత్ సోషల్ మీడియాలో ఒక ఆడియోను రిలీజ్ చేయడం జరిగింది.
సంయుక్తకు గతం లో ఒక లవ్ స్టోరీ ఉందని ఆమె తన మాజీ ప్రియుడిని మరిచి పోలేదని విష్ణుకాంత్ ఆరోపణలు చేశారు. ఈ ఆడియో క్లిప్ విషయం లో సంయుక్తను చాలామంది ట్రోల్ చేశారు. అయితే ఆ ఆడియో క్లిక్ కు కౌంటర్ ఇస్తూ సంయుక్త సైతం షాకింగ్ కామెంట్లు చేశారు. విష్ణుకాంత్ తనకు నరకం చూపించాడని సంయుక్త చెప్పుకొచ్చారు. విష్ణుకాంత్ తనను శారీరకంగా, మానసికం గా వేధించాడని ఆమె తెలిపారు.
అడల్ట్ వీడియోలు చూడాలని నా భర్త నన్ను టార్చర్ చేశాడని సంయుక్త పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయక పోయినా తనను చిత్ర హింసలను గురి చేశాడని ఆమె అన్నారు. తన భర్త బెడ్ రూమ్ లో కెమెరా పెట్టి అన్నీ షూట్ చేసేవాడని సంయుక్త కామెంట్లు చేశారు. తనను వ్యభిచారిలా భర్త ట్రీట్ చేశాడని ఆమె పేర్కొన్నారు. తాను అలర్జీ వల్ల ఆస్పత్రికి వెళ్తానన్నా భర్త ఒప్పుకోలేదని సంయుక్త కామెంట్ చేశారు.ఈ కామెంట్ల గురించి విష్ణు కాంత్ స్పందిస్తూ నా భార్య ఇప్పటికీ తన తప్పు ను ఒప్పుకోవడం లేదని నా మీద నిందలు వేస్తుందని ఆ నిందలు నిజమైతే సాక్ష్యాలు చూపించాలని అన్నారు. సంయుక్త అబద్ధాలు చెబుతోందని సాక్ష్యాధారాలు లేకుండా ఆమె చెప్పే మాటలు నమ్మ వద్దని పేర్కొన్నారు. ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: