యాడ్ కోసం ప్రభాస్ ఎంత తీసుకున్నాడో తెలుసా..?

Divya
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కేవలం ప్రభాస్ ఎక్కువగా సినిమాలలో నటిస్తారు తప్ప పలు రకాల యాడ్లలో ఎప్పుడు చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి ప్రోడక్ట్ అవసరం అవుతుందా లేదా అది మంచి ప్రోడక్ట్ లేదా అనే విషయం ప్రజలకు చాలా అవసరం. కాబట్టి ఇలాంటి వాటిలో ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి అడుగులు వేయాలని అభిమానులు సైతం సూచిస్తూ ఉంటారు. దీంతో చాలామంది స్టార్స్ సైతం కొన్ని యాడ్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారు మరి కొంతమంది చేయరు.
ఇప్పటికే మహేష్ ,అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పలువురు స్టార్ హీరోలు పలు రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దీంతో భారీగానే రెమ్యూనరేషన్ కూడా సంపాదిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ప్రభాస్ ఎలాంటి యాడ్లో నటించలేదు . కానీ రీసెంట్గా ఒక యాడ్ చేశారు. ఆ యాడ్ కి తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది . ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే ఈ యాడ్  కి రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ సంపాదించిన ప్రభాస్ ఈనెల 16వ తేదీన తను నటించిన ఆది పురుష్ సినిమా కూడా విడుదల కాబోతోంది.
ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ ఒక మహేంద్ర కారు యాడ్ లో కనిపించారు.. అచ్చం సినిమా స్టైల్ లాగా అనిపించే ఈ యాడ్ పై ప్రభాస్ చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఆ యాడ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. అయితే ఈ యాడ్ కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అంటే జీరో.. అంత పెద్ద స్టార్ హీరో అయిండి ..స్టంట్ తో ఉన్న యాడ్ అయినప్పటికీ ప్రభాస్ యాడ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం . దీంతో అభిమానులు కాస్త షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: