"నరసింహనాయుడు" రీ రిలీజ్ ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ ఫుల్ జోష్ లో నడుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన ఎన్నో సినిమాలు కూడా థియేటర్ లలో రీ రిలీజ్ అయ్యాయి. అందులో భాగంగా ఇప్పటికే నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందినటువంటి చెన్నకేశవరెడ్డి సినిమా కూడా రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇది ఎలా ఉంటే ఈ సంవత్సరం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బాలకృష్ణ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించినటువంటి సినిమాను థియేటర్ లలో 4 కే వర్షన్ తో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది.
 

కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ , బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందినటువంటి నరసింహ నాయుడు అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విశ్వం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను కూడా వసూలు చేసింది. ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్ గా నటించగా ... మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

అందులో భాగంగా ఈ మూవీ ని ఓవర్ సీస్ లో జూన్ 9 వ తేదీన 4 కే వర్షన్ తో రీ రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను "సరిగమ సినిమాస్" సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకతించింది. మరి ఈ మూవీ రీ రిలీజ్ కి ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: