ఆ సినిమాకు పూర్తి డేట్స్ కేటాయించిన పవన్..!!

murali krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస గా క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిల్లో 'ఓజి'( OG ) కూడా ఒకటి..
ఈ సినిమా షూట్ ఆల్రెడీ స్టార్ట్  కూడా అయ్యింది. అలా ప్రకటించిన కొద్దీ రోజుల కే షూట్ స్టార్ట్ చేసి పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ సర్ప్రైజ్ ను ఇచ్చాడు.. ముంబైలో స్టార్ట్ అయిన ఈ షూట్ ఆ తర్వాత పూణేలో కొద్దీ రోజులు అయితే జరుపుకుంది. ఇక అక్కడ కూడా ముగించి హైదరాబాద్  ను చేరుకున్నారు.
ఇటీవలే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి టాకీ పార్ట్ మొత్తం శరవేగంగా పూర్తి చేస్తున్నారని సమాచారం.. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం.. గ్యాంగ్ స్టర్ నేపథ్యం లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు రావడంతో ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచేసు కుంటున్నారు ఫ్యాన్స్
ఇదిలా ఉండగా పవన్ సినిమాలతో పాటు రాజకీయాల లో కూడా పాల్గొంటాడు అనే సంగతి తెలిసిందే.. మరి ప్రజెంట్ అయితే ఓజి సినిమా షూట్ లోనే ఆయన బిజీగా ఉన్నాడు.. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా బిజీ కానున్నాడని తెలుస్తుంది... జూన్ 14 నుండి తన వారాహి యాత్రని స్టార్ట్ చేయనున్నట్టుగా నిన్ననే కన్ఫర్మ్  కూడా అయ్యింది. ఈ లోపులోనే మిగిలిన డేట్స్ మొత్తం ఓజి సినిమా కు కేటాయించినట్టు సమాచారం.. అందుకే పవన్ వారాహి యాత్ర స్టార్ట్ అయ్యే వరకు పవన్ ఓజి షూట్ లోనే ఉండనున్నారని ఆ వెంటనే వారాహి యాత్రలో బిజీగా మారనున్నారని సమాచారం.. ఇదిలా ఉండగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా అయితే నటిస్తుంది.. అలాగే థమన్ సంగీతం అందిస్తుండగా.. డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: