బేబమ్మ టాప్ లేపేసిందిగా.. నీపై నీకు నమ్మకం ఉంచంటూ..!

shami
బేబమ్మ కృతి శెట్టి ఉప్పెన సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకోగా ఆ ఒక్క సినిమా వల్ల అరడజనుకి పైగా సినిమాలు ఛాన్స్ అందుకుంది. టాలీవుడ్ కి మరో స్టార్ హీరోయిన్ దొరికేసింది అనుకునేలోగా వరుస ఫ్లాపులు అమ్మడిని పలుకరించాయి. ఈ ఏడాది బంగార్రాజు తప్ప అన్నీ ఫ్లాప్ సినిమాలు చేసిన కృతి శెట్టి చిన్నగా అవకాశాలు కూడా దూరమవడం గమనించింది. ఇక ఇలా ఉంటే కుదిరేట్టు లేదని అమ్మడు గ్లామర్ షో కి రెడీ అంటుంది. కృతి శెట్టి ఈమధ్య ఫోటో షూట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టింది. అమ్మడు స్లీవ్ లెస్ జాకెట్స్ తో సూపర్ అనిపించేస్తుంది.
ఇక లేటెస్ట్ గా పైన ఒక జాకెట్ మాత్రమే అది కూడా స్లీవ్ లెస్ తో బాబోయ్ బేబమ్మ కూడా స్కిన్ షో కి రెడీ అని హింట్ ఇచ్చేస్తుందని అనిపిస్తుంది. సినిమాలతో సంబంధం లేకుండా ఫోటో షూట్స్ వల్ల హీరోయిన్స్ కి మంచి క్రేజ్ లభిస్తుంది. కృతి శెట్టి ఇన్నాళ్లకు ఆ సీక్రెట్ కనిపెట్టింది. అందుకే అమ్మడు ఇక వరుస ఫోటో షూట్స్ తో హంగామా చేస్తుంది. లేటెస్ట్ ఫోటో షూట్ అయితే అమ్మడు అందాలను గుమ్మరించేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా తన ఫోకస్ అంతా కూడా తన ఫాలోవర్స్ ని తన అందాలతో టెంప్ట్ చేసేలా ఉందని చెప్పొచు.
రీసెంట్ గా కస్టడీ కూడా ఫ్లాప్ అవగా రాబోతున్న శర్వానంద్ సినిమా మీదే తన ఫోకస్ పెట్టింది అమ్మడు. అంతేకాదు మలయాళంలో టోవినో థామస్ తో కూడా ఒక సినిమా చేస్తుంది కృతి శెట్టి. ఇక లేటెస్ట్ ఫోటో షూట్ కి అమ్మడు ఒక కామెంట్ కూడా జత చేసింది. ఏ ఫ్రెష్ స్టార్ట్ ఇది కొత్త ప్లేస్ కాదు కొత్త మైండ్ సెట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటూ మెసేజ్ ఇస్తుంది అమ్మడు. మరి అమ్మడు తన మీద తనకు నమ్మకం ఉంచుకునే క్రమంలో ఇలాంటి మెసేజ్ ఇస్తుందా అని డౌట్ పడుతున్నారు ఆడియన్స్. ఏది ఏమైనా బేబమ్మ అందాలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: