ఆ సీక్వెల్ మూవీ లో ఛాన్స్ దక్కించుకున్న రష్మిక....!!

murali krishna
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి రష్మిక మందన్న.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు.
ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో కూడా బిజీ గా మారిపోయారు.ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీ గా ఉన్నటువంటి ఈమె తాజాగా మరొక బాలీవుడ్ సినిమా అవకాశాన్ని అందుకున్నారని తెలుస్తుంది.
తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం విక్రమార్కుడు .ఈ సినిమా ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.తెలుగులో ఎంతో మంచి సక్సెస్ అవ్వడంతో ఈ చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్  హీరోగా రౌడీ రాథోడ్ అనే టైటిల్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది అని చెప్పాలి.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ఎంతో అద్భుతమై న విజయాన్ని అందుకున్నటువంటి రౌడీ రాథోర్ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ చిత్రాన్ని చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే రౌడీ రాథోర్ సీక్వెల్ చిత్రానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది.ఇక ఇందులో హీరోగా అక్షయ్ కుమార్ కి బదులు షాహిద్ కపూర్ నటించబోతున్నారట.ఈ క్రేజీ ప్రాజెక్టులో రష్మిక మందన్న హీరోయిన్గా సెలెక్ట్ అయ్యారని తెలుస్తోంది.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ సొంతం చేసుకోవడంతో ఈమె అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా కు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకుడిగా వ్యవహరించబోతున్నారని తెలుస్తుంది.
ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగా వ్యవహరించబోతున్నారని సమాచారం.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళబోతుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: