"మేజర్" మూవీకి మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు క్షణం మూవీ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరువాత వరుసగా గూడాచారి, ఎవరు, మేజర్, హిట్ ది సెకండ్ కేస్ మూవీ లతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ నటుడు మేజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రాబట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టిన ఈ సినిమా తాజాగా బుల్లి తెరపై ప్రసారం అయింది. కాకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించిన రేంజ్ లో బుల్లి తెరపై ప్రేక్షకులను అలరించ లేక పోయింది.

ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను దక్కించుకున్న జెమినీ సంస్థ ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే మొదటి సారి జెమినీ టీవీ లో ప్రసారం చేసింది. అందులో భాగంగా ఈ మూవీ మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు కేవలం 1.87 "టి ఆర్ పి" రేటింగ్ ను మాత్రమే తెచ్చుకుంది. ఒక హిట్ సినిమాకి ఈ "టి ఆర్ పి" రేటింగ్ చాలా తక్కువే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: