తాజాగా
సుమంత్ ప్రభాస్ అనే
యువ నటుడు మేము ఫేమస్ అనే
మూవీ లో
హీరో గా నటించాడు. ఈ
మూవీ తోనే ఈ
యువ నటుడు
హీరో గా
వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈయన ఈ
మూవీ లో
హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ
సినిమా కొన్ని రోజుల క్రితమే
థియేటర్ లలో మంచి అంచనాల నడుమ విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ
సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ
సినిమా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ
మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 86 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా , రెండవ రోజు 79 లక్షలు , మూడవ రోజు 76 లక్షలు , నాలుగవ రోజు 41 లక్షలు , ఐదవ రోజు 37 లక్షలు , ఆరవ రోజు 33 లక్షలు , ఏడవ రోజు 27 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ
సినిమా 7 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపు కొని 1.90 కోట్ల షేర్ ... 3.78 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ ఏడు రోజుల్లో ఈ
సినిమా రిమైనింగ్ ప్రాంతాల్లో 1.16 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా 7 రోజులకు కలుపు కొని ఈ
సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.41 కోట్ల షేర్ ... 4.94 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ
మూవీ 2.0 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రపంచ వ్యాప్తంగా
బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్మలను కంప్లీట్ చేసుకున్న ఈ
సినిమా ప్రపంచ వ్యాప్తంగా 21 లక్షల లాభాలను అందుకుంది. ఇప్పటికీ కూడా ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లను రాబడుతుంది.