ట్రైలర్:మనసులు తాకేలా విమానం మూవీ ట్రైలర్..!!
గతంలో విమానం సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్లు బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ రోజున ఈ సినిమా ట్రైలర్‌ని చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది.. ఈ సినిమా ను జూన్ 9వ తేదీన తెలుగు తమిళ భాషలలో ఒకేసారి చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే బాగోద్వేగాల కలయికత రూపొందించిన చిత్రంగా కనిపిస్తోంది ముఖ్యంగా బస్తీలో ఉండే తండ్రి కొడుకులు ఒక నిరుపేద కుటుంబంలో ఉండే పిల్లాడికి విమానం ఎక్కాలని కోరిక పుడుతుంది.. తన కొడుకుని ఎలాగైనా సరే విమానం ఎక్కించాలని తండ్రి పడ్డ కష్టాన్ని ఈ సినిమా ట్రైలర్ లో చూపించారు.
అంతేకాకుండా తండ్రి అవీటితనంతో బాధపడుతున్నప్పటికీ తన కొడుకు కోరికను తీర్చాలని రాత్రి పగలు సైతం కష్టపడుతూ ఉంటారు. అలా తన కొడుకు కోరికను తీర్చారా లేదా అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా అనసూయ పాత్ర కూడా ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా ఉండడమే కాకుండా కాస్త అట్రాక్షన్ అయ్యేవిధంగా ఉండడంతో పాటు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎమోషనల్‌తో కూడిన సినిమా అన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేలా కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ అనుపమ పరమేశ్వరం విడుదల చేసినట్టు తెలుస్తోంది.