నిఖిల్ నుండి మరో మూవీ అప్డేట్ రాబోతుంది... ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీడేస్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు హ్యాపీ డేస్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని సాధించుకున్నప్పటికీ ఆ తర్వాత కొన్ని మూవీల్లో హీరోగా నటించిన ఆ సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజాయలను సాధించలేదు. దానితో తన కెరీర్ ను చాలా డల్ గా కొనసాగిస్తున్న సమయం లోనే నిఖిల్ "స్వామిరారా" మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.

ఆ తర్వాత కార్తికేయ , ఎక్కడికి పోతావు చిన్నవాడా , సూర్య వర్సెస్ సూర్య , అర్జున్ సురవరం , కార్తికేయ 2 ,  18 పేజెస్ మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ యువ హీరో "స్పై" అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ కొత్తగా ప్రారంభించినటువంటి బ్యానర్ లో ది ఇండియా హౌస్ అనే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఇది ఇలా ఉంటే నిఖిల్ కు సంబంధించిన మరో మూవీ అప్డేట్ మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... నిఖిల్ ... ఠాగూర్ మధు బ్యానర్ లో ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా నిఖిల్ తదుపరి మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: