ఆ బ్యానర్ పై మరో సినిమాకు సిద్ధం ఐనా అక్కినేని హీరో....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నాగచైతన్య ఒకరు.
ఈయన హీరోగా పలు సినిమాలలో నటించారు. అయితే ఈ మధ్యకాలంలో నాగచైతన్య నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ కావడంతో ఈయన కాస్త ఆలోచనలో పడ్డారు. నాగచైతన్య తాజాగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తనని తీవ్ర నిరాశపరిచిందని చెప్పాలి. గతంలో కూడా థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్యకు ఈ సినిమా తీవ్ర నిరాశ కలిగించింది.
ఇక నాగచైతన్య తాజాగా వెంకట్ ప్రభూ దర్శకత్వంలో కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదలైంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న నాగచైతన్యకు తీవ్ర నిరాశ మిగిలిందని చెప్పాలి. ఇక ఈ రెండు సినిమాలు కూడా వరుసగా డిజాస్టర్ కావడంతో నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ లో చేయబోతున్నారని తెలుస్తుంది.
గతంలో కూడా నాగచైతన్య గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 100% లవ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత మరోసారి నాగచైతన్య గీత ఆర్ట్స్ బ్యానర్ లో మరో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ గా ప్రముఖ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే చందు మొండేటి కార్తికేయ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన ఈసారి నాగచైతన్య డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం కార్తికేయ సినిమా తో చందు మొండేటి కి పన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ గా పేరు వచ్చింది ఇక దానితో ఈ సినిమాకి నాగచైతన్య కుడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: