ఆమెను కొంచం తగ్గించుకొని సినిమాలు చేయాలంటున్నా అభిమానులు....!!

murali krishna
కోలీవుడ్ స్టార్ నటుడు ఐనా శరత్ కుమార్ నట వారసురాలు అయిన వరలక్ష్మి శరత్ కుమార్ కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న విషయం తెల్సిందే.
హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్నా కూడా ఎక్కువ శాతం విలన్ వేషాలకే ఆసక్తి చూపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వరలక్ష్మి శరత్ కుమార్ యొక్క డిమాండ్ తెలుగు లో చాలానే ఉంది. ఈ అమ్మడు తెలుగు లో నటించేందుకు కాస్త ఎక్కువ డిమాండ్ చేస్తుంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ అమ్మడు తెలుగు లో ఏ సినిమా లో నటించాలి అన్నా కూడా ఏకంగా కోటిన్నర పారితోషికం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుందట. హీరోయిన్స్ కే కోటి రూపాయలు పారితోషికం ఇచ్చేందుకు ఇబ్బంది పడుతున్న నిర్మాతలు వరలక్ష్మి శరత్ కుమార్ కు ఆ స్థాయి లో పారితోషికం ఇచ్చేందుకు నో అన్నట్లుగా తెలుస్తోంది. ఆమె పారితోషికం విషయం లో కాస్త చూసి చూడనట్లుగా వ్యవహరిస్తే కచ్చితంగా ఏడాదికి అయిదు నుండి పది సినిమాల వరకు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ స్థాయిలో ఆమెకు డిమాండ్ ఉంది కనుకే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముందు ముందు ఈమె సందడి మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక పారితోషికం తగ్గించుకుని సినిమాలు చేయాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ అంటే అభిమానం ఉన్న వారు ఈమె ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చేందుకు ఓకే చెబుతున్నారు. అలా వరలక్ష్మి శరత్ కుమార్ చాలా వరకు సినిమాలు కోల్పోతుంది. కొన్ని సినిమాలు మాత్రమే చేయగలుగుతుంది అంటూ సమాచారం అందుతోంది. తమిళంలో కాస్త తక్కువ ఇచ్చినా కూడా ఈమె నటించేందుకు ఓకే చెబుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: