ఆ రోజుల్లో అన్నీ కోట్లు వసూలు చేసిన మెగాస్టార్ మూవీ....!!

murali krishna
మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో 1000 కోట్ల రూపాయిలను కొల్లగొట్టడం అనేది పెద్ద ఘనత గా చెప్పుకుంటారు. రీసెంట్ గా విడుదలైన బాహుబలి 2 , kgf 2 , #RRR మరియు పఠాన్ వంటి చిత్రాలు వెయ్యి కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరిన తర్వాత ట్రేడ్ పండితులు ఆ సినిమాలను, వాటిని తెరకెక్కించిన దర్శక నిర్మాతలు మరియు హీరోలను పొగడ్తలతో ముంచి ఎత్తారు.
ఇప్పుడు పెరిగిన మార్కెట్ కి తగ్గట్టుగా, ఉన్న సరికొత్త టెక్నాలజీ స్క్రీన్స్ మరియు ఖర్చు చేసే భారీ బడ్జెట్ ని పరిగణలోకి తీసుకొని అంత వసూళ్లు వచ్చాయంటే ఎలాంటి ఆశ్చర్యం లేదు.కానీ ఆరోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు, అంత పెద్ద టెక్నిషియన్స్ కూడా లేరు. థియేటర్స్ లో టికెట్ ధర రూపాయి నుండి నాలుగు రూపాయిల వరకు మాత్రమే ఉండేది. అలాంటి రోజుల్లో సంచలనం సృష్టించిన ఒక సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము, ఆ చిత్రం పేరే మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన 'యముడికి మొగుడు'.
అప్పటికే నందమూరి తారకరామారావు 'యమగోల'  పేరుతో ఒక సినిమా చేసి ఇండస్ట్రీ రికార్డ్స్ తో చెడుగుడు ఆడుకున్నాడు. ఆయన చేసిన తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో ఎవ్వరూ మ్యాచ్ చెయ్యలేరేమో, చిరంజీవి 'యముడికి మొగుడు' చిత్రం తో చాలా రిస్క్ చేస్తున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ చిత్రం అప్పట్లో విడుదలై సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. అప్పటి వరకు ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి, సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. కైకాల సత్యనారాణ యముడిగా , అల్లు రామలింగయ్య చిత్ర గుప్తుడిగా, వీళ్ళిద్దరిని ఆటపట్టించే పాత్రలో మెగాస్టార్ చిరంజీవి చెలరేగిపోయాడు. ఇప్పటికీ ఈ చిత్రం టీవీ లో వచ్చిందంటే ప్రేక్షకులు ఉన్న పనులన్నీ మానుకొని మరి టీవీ ముందు కూర్చుంటారు. అంతటి క్రేజ్ ఈ సినిమాకి ఉంది. యముడి బ్యాక్ డ్రాప్ లో వచ్చే మూవీస్ కి ఒక రోల్ మోడల్ లాగ నిల్చింది ఈ చిత్రం. అయితే ఆ రోజుల్లో థియేటర్స్ లో టికెట్ రేట్ రూపాయి నుండి నాలుగు రూపాయిల వరకు ఉండేది. ఆ టికెట్ రేట్స్ తోనే ఈ చిత్రం వసూళ్లు నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇప్పటి లెక్కల్లో ఒక సారి చూస్తే మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా చూస్తున్న వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన 'పసివాడి ప్రాణం' అనే చిత్రం కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఆ తర్వాత 'యముడికి మొగుడు' , 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు', 'గ్యాంగ్ లీడర్' మరియు 'ఘరానా మొగుడు' ఇలా వరుసగా 5 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఏకైక ఇండియన్ హీరో గా చిరంజీవి సరికొత్త చరిత్ర సృష్టించాడా. ఈ ఫేస్ లో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కి నెంబర్ 1 హీరో గా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: