"రామబాణం" మూవీ నుండి ఆ సాంగ్ విడుదల..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన మాస్ ఇమేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి అందులో కొన్ని సినిమాలతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా గోపీచంద్ "రామబాణం" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.
 

ఈ మూవీ లో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా ... శ్రీ వాసు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఇది వరకు గోపీచంద్ ... శ్రీ వాసు కాంబినేషన్ లో రూపొందిన లక్ష్యం , లౌక్యం అనే రెండు సినిమాలు రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో రామబాణం మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. దానితో చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేస్తున్న పాటల్లో "ఐ ఫోన్" అంటూ సాగే సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ సినిమా విడుదల అయ్యాక కూడా ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా లోని "ఐ ఫోన్" అంటూ సాగే వీడియో సాంగ్ ను తాజాగా విడుదల చేసినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ లోని "ఐ ఫోన్"  వీడియో సాంగ్ కు ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: