సెక్సీలుక్స్ తో టెంప్ట్ చేస్తున్న ఆషీక బతిజా....!!

murali krishna
హీరోయిన్ చెల్లిగా మెప్పించి ఆ తర్వాత వీరే సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటించినవారు చాలామందే ఉన్నారు. కానీ కొంతమందికి మాత్రం అందం, అభినయం ఉన్నప్పటికీ ఆ ఒక్క సినిమాకే పరిమితమవుతారు. ఈ లిస్టులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు ఆషీకా బతిజా.సినిమాల్లో హీరోయిన్లు ఎంత గ్లామరస్ గా ఉంటారో.. హీరో చెల్లి పాత్ర కూడా అంతే గ్లామర్ గా ఉంటుంది. మరి హీరోయిన్ చెల్లి క్యారక్టర్ అంటే ఆమెకు తగ్గట్టే గ్లామర్ ఉండేలా చూసుకుంటారు. హీరోయిన్ చెల్లిగా మెప్పించి ఆ తర్వాత వీరే సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటించినవారు చాలామందే ఉన్నారు. కానీ కొంతమందికి మాత్రం అందం, అభినయం ఉన్నప్పటికీ ఆ ఒక్క సినిమాకే పరిమితమవుతారు. ఈ లిస్టులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు ఆషీకా బతిజా . ఈ పేరు జనాలకు తెలియకపోవచ్చు కానీ కిక్ సినిమాలో ఈ అమ్మడు పాత్ర మాత్రం ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ భామ తన అందాలను చూపిస్తూ ఆడియన్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.
2009 లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవి తేజ హీరోగా వచ్చిన సినిమా కిక్. ఈ సినిమలో ఇలియానా హీరోగా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాలో నటించిన క్యారెక్టర్లు జనాలకు అలాగే గుర్తుండి పోయాయి. అందులో ఒక క్యారక్టర్ ఆషీకా బతిజా. ఈ సినిమాలో ఇలియానా చెల్లిలిగా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇలియానా, రవి తేజ, ఆషీకా బతిజా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రథమార్ధంలో చాలా సరదాగా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అయితే ఆమె పోషించింది చాలా చిన్న పాత్రే, చిత్రం లో ఆమె కనిపించేది కూడా రెండు మూడు సన్నివేశాల్లోనే కానీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
ఈ సినిమా తర్వాత ఈమెకు అవకాశాలు బాగా వస్తాయని అందరూ ఆశించారు కానీ అలా జరగలేదు. కిక్ సినిమా తర్వాత ఆమె మరో సినిమాలో కనిపించలేదు. దీంతో చేసేదేమిలేక చదువుల కోసం లండన్ కి వెళ్ళింది. ఆ తర్వాత ఈమె మోడలింగ్ రంగం లోకి అడుగుపెట్టి అక్కడే స్థిరపడిపోయింది. అయితే తాజాగా ఈ భామ హాట్ లుక్స్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్లాక్ డ్రెస్సులో, హై హీల్స్ వేసుకొని దిగిన ఆషీకా బతిజా ఫోటోలు ప్రస్తుతం కుర్రకారును ఆకర్షిస్తున్నాయి. దాదాపు 14 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాంటి గ్లామర్ తోనే కనిపించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: