నేను చేసింది ఆ పాత్ర అని నాకు తెలీదు : వనిత విజయ్ కుమార్

murali krishna
నరేష్ - పవిత్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'మళ్ళీ పెళ్లి' సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల కాకూడదు అంటూ నరేష్ మూడో భార్య అయిన రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఎందుకంటే ఈ సినిమాలో ఆమె పాత్రను నరేష్ నెగిటివ్ గా చూపించినట్టు టీజర్ మరియు ట్రైలర్ వంటివి క్లారిటీ కూడా ఇచ్చాయి. నరేష్ - పవిత్ర కర్ణాటక వెళ్ళినప్పుడు ఓ హోటల్లో ఉండగా… అక్కడికి మీడియాని వెంటేసుకుని వచ్చి రమ్య రఘుపతి చేసిన రచ్చ అయితే అంతా కూడా చూశారు.
ఆ న్యూస్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత పంచాయితీలు అయితే అందరికీ తెలిసినవే. అవన్నీ 'మళ్ళీ పెళ్లి' టీజర్, ట్రైలర్లో అయితే ఉన్నాయి. వీటిపై న్యూస్ ఛానల్స్ లో కూడా చర్చలు బాగా జరిగాయి. అలాగే 'మళ్ళీ పెళ్లి' ప్రెస్ మీట్లలో నరేష్ ను కూడా చాలా మంది రిపోర్టర్లు ఈ విషయమై ప్రశ్నలు వేయడం కూడా జరిగింది. 'మళ్ళీ పెళ్లి' లో రమ్య రఘుపతి పాత్రని పోషించింది వనిత విజయ్ కుమార్.
 అయితే వనిత విజయ్ కుమార్ పోషించిన పాత్ర నిజ జీవితంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిదన్న సంగతి ఆమెకు తెలీదట. తన పాత్ర 'ఓ స్ట్రాంగ్ మహిళ లాంటి పాత్ర' అన్నట్టు దర్శకుడు యం.యస్.రాజు చెప్పారని చెప్పుకొచ్చింది.కొన్నాళ్ల క్రితం 'దేవి' సినిమాకి ఆయనతో కలిసి పనిచేసిన అనుభవంతో 'మళ్ళీ పెళ్లి' కి ఆమె ఓకే చెప్పేసినట్టు వనిత విజయ్ కుమార్ చెప్పిందటా.. అలాగే తన వరకు ఆ పాత్రకు న్యాయం చేసానని కూడా ఈమె చెప్పినట్లు సమాచారం.వనిత విజయ్ కుమార్ కూడా వరుస మూడు పెళ్లిళ్లు చేసుకొని అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈమె తెలుగులో దేవి సినిమాతో మంచి పాపులర్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: