"మావిరన్" మూవీకి సంబంధించిన ఆ పనులను ప్రారంభించిన శివ కార్తికేయన్..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ ను ఏర్పరచుకున్న నటులలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నరుడు ఇప్పటికీ తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేసి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ హీరో ప్రిన్స్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి అనుదీప్ కే వి దర్శకత్వం వహించాడు.
 

ఈ మూవీ తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయ్యి యవరేజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు మావిరన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాకు మాడోనే అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా తమిళ్ టి పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తమిళ్ లో మావీరన్ అనే పేరుతో విడుదల కానున్న ఈ సినిమా తెలుగు లో మహా వీరుడు అనే పేరుతో విడుదల కానుంది. మొదట ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఆ తర్వాత ఈ మూవీ ని జూలై 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ కి సంబంధించిన డబ్బింగ్ పనులను ఈ మూవీ హీరో శివ కార్తికేయన్ మొదలు పెట్టాడు. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక అనౌన్స్మెంట్ ను కూడా ఈ మూవీ బృందం ఇచ్చింది. మరి ఈ మూవీ తో శివ కార్తికేయన్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి. ఏ మూవీ పై తమిళ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉండగా ... ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: