సునిశిత్ ను ఘోరంగా భయపెట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్స్...!!

murali krishna
సునిశిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో తాను చేయాల్సిన హీరో పాత్రలను.. స్టార్ హీరోలు అడిగితే ఇచ్చేసానని తెగ బిల్డప్ ఇస్తూ తిరుగుతూ..
స్టార్ హీరోలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడటా.. ముఖ్యంగా ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ పై సునిశిత్ చేసే వ్యాఖ్యలు చాలా ఘాటుగా అయితే ఉంటాయి. ఇక కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కూడా తమ రేటింగ్ పెంచుకోవడానికి ఇతగాడిని ఇంటర్వ్యూలకు పిలిచి.. హీరోల గురించి మాట్లాడమని కూడా చెప్తూ ఉంటారు. దొరికిందే సందు అన్నట్లు.. ఈ శాక్రిఫైజ్ స్టార్.. నోటికి ఏది వస్తే అది హీరోల గురించి మాట్లాడి తన్నులు తింటూ ఉంటాడటా.మొన్నటికి మొన్న రామ్ చరణ్,ఉపాసన ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి రామ్ చరణ్ ఫ్యాన్స్ చేతిలో చావు దెబ్బలు తిన్నాడటా.. అయినా ఇతడిలో మార్పు అయితే రాలేదు. ఆ తరువాత సునిశిత్, జూనియర్ ఎన్టీఆర్ మీద ఘాటు ఆరోపణలు కూడా చేశాడు. ” జూనియర్ ఎన్టీఆర్‌ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఎంత పెద్ద హీరో అయినా అతను పోర్న్ సినిమాలు కూడా చేశాడు. కానీ ఈ సంగతి ఎవరికీ తెలియదు. కేవలం నాకు మాత్రమే తెలుసు” అంటూ వాగాడు.
ఇక అంతే ఎన్టీఆర్ ను పోర్న్ సినిమాలు చేశాడు అంటావా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. సునిశిత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది.. ఆగ్రహం ఒక్కటేనా కనిపిస్తే కచ్చితంగా చంపేస్తాం అన్నంతగా కర్రలు పట్టుకు మరి తిరిగారు. దీంతో చాలా రోజుల నుంచి సునిశిత్ ప్రాణభయంతో పరుగులు పెడుతూనే ఉన్నాడటా.ఇక తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కూల్ చేస్తూ సునిశిత్ ఎన్టీఆర్ కు, ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్పుకొచ్చాడటా.. “ఎన్టీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పే. నన్ను క్షమించండి ఎన్టీఆర్ గారు నన్ను క్షమించండి.. ఫ్యాన్స్ నా తప్పును మన్నించి.. ఇకనుంచి నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దని నేను కోరుకుంటున్నాను. నేను ఈరోజు నుంచి ఎన్టీఆర్ కు సపోర్టర్ ను.. థాంక్స్” అంటూ చెప్పుకొచ్చాడటా.. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారటా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: