శరత్ బాబు అంత్యక్రియల తర్వాత బయటపడ్డ విషయాలు....!!

murali krishna
శరత్ బాబు మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇక శరత్ బాబు కుటుంబంలో ఆయన ఆస్తి గురించి తగాదాలు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది.ఇక ఈక్రమంలోనే శరత్ బాబు డైరీ గురించి న్యూస్ వైరల్ అవుతోంది.సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు సినీ ప్రియులను విషాదంలోకి నెట్టేస్తున్నాయి. తాజాగా సీనియర్ నటుడు శరత్ బాబు మరణం ఇండస్ట్రీకి షాక్ కు గురి చేసింది. ఇక ఆయన మరణంతో శరత్ బాబు ఫ్యామిలీలో గొడవలు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ తో బాధపడుతూ ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే.
శరత్ బాబు మరణం పట్ల సినీ.. రాజకీయ వర్గాల నుంచి సెలబ్రిటీలు సంతాపం తెలియజేశారు. ఇక ఈక్రమంలో శరత్ బాబు ఆర్ధిక పరిస్థితుల గురించి.. పెద్ద చర్చ జరుగుతుంది. తనకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని. బాగా సంపాదించి బలంగా ఉన్నానని ఆయన చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు.తాజాగా శరత్ బాబుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడాయాలో వైరల్ అవుతోంది. ఆయన మరణం తరువాత కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలైనట్టు సమాచారం. తన ఆస్తిని తన సోదరుల వారసులకు రాసిచ్చారట. తను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా.. పిల్లలు లేకపోవడంతో.. ఆస్తి తన డబుట్టిన వారికి ఇచ్చినట్టు సమాచారం.
అయితే ఆయన పేరుమీద ఉన్న ఆస్తి గురించి ప్రస్తుతం గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో శరత్ బాబు డైరీ హాట్ టాపిక్ అవుతోంది. తనకు ప్రతిరోజు డైరీ రాసే అలవాటు ఉందని.అతను సినిమాకష్టాల గురించి, తన కుటుంబం గురించి రాసుకున్నట్లు సమాచారం. అంతేకాదు తాను చివరి రోజుల్లో ఎక్కడ గడపాలని కూడా అందులో రాసుకున్నాడని తెలుస్తోంది.శరత్ బాబు తన విశ్రాంతి జీవితం గురించి చాలా ప్లాన్ చేసుకున్నారట. ఆంధ్ర ప్రదేశ్ లోని.. ఊటీగా పేరు గాంచిన హార్స్లీ హిల్స్ లో.. ఆయన ఇంటిని కట్టుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారట... ఇంకా ఉన్న ఆస్తులను 13 భాగాలు చేసి.. తన బంధువులకు రాసి.. తాను మాత్రం చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణానికి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న హార్స్లీ హిల్స్ శేష జీవితం గడపాలని చివరి కోరికగా పెట్టుకుని ఉన్నాడట. కాని అవేవి తీరకుండానే శరత్ బాబు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు.
ఇల్లు కట్టుకోవాలి అనుకున్న శరత్ బాబు.. దానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో శరత్ బాబు చివరి కోరిక తీరలేదు. అయితే ఆయన తన చివరి కోరికను డైరీలో రాసుకున్నట్టు తెలుస్తోంది. శరత్ బాబుకు హార్స్లీ హిల్స్లో లో.. ఎప్పటి నుంచో స్థలం ఉంది. ఆ స్థలం ఉందని, ఆ స్థలంలో 1985లోనే ఇల్లు కట్టాలని స్టార్ట్ చేసి.. కొంత కాలానికి నిర్మాణం ఆపేశారట.దాదాపు 250 సినిమాల్లో నటించారు శరత్ బాబు. తెలుగు, తమిళ, కన్నడ,హిందీ, మలయాళం ఐదు భాషల్లో అద్భుతమైన సినిమాలు చేశారు. ఇక ఈ సినిమాల్లో దాదాపు 70 సినిమాల్లో ఆయన హీరోగా నటించి మెప్పించారు. మొత్తం 8 నందీ అవార్డ్ లు అందుకున్న శరత్ బాబు.. మూడుసార్లు వరుసగా నంది అవార్డులను అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: