ఆ హీరో పరువు తీసిన నటి ' మీనా ' తల్లీ....!!

murali krishna
మీనా తల్లి ఆ హీరోను అందరూ చూస్తుండగానే ఘోరంగా అమానించింది. ఆ హీరోయిన్ తల్లి చేసిన పనికి ఆ హీరో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మీనా తల్లి చేసిన అవమానం ఏంటి? ఇంతకు ఆ హీరో ఎవరంటే?

ప్రముఖ నటి మీనా… ఈమె ఒకప్పటి హీరోయిన్. తన అందం, అభినయంతో కుర్రాళ్ల మనసులు దోచేసింది. మీనా ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఇక నాలుగు పదుల వయసు పెరిగినా ఆమె అందం మాత్రం ఇప్పటికి చెక్కు చెదరలేదు. ఇకపోతే, ఆమె భర్త విద్యా సాగర్ గతేడాది మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి ఆమె ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుని సినిమాల్లో నటిస్తున్నారు. భర్త చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు రెండో పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆమె కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు కూడా షికారు చేశాయి.

ఇదిలా ఉంటే, తమిళనాడులో రజినీ కాంత్ తర్వాత ఎక్కువగా అభిమానించే హీరోల్లో ఒకరు అజిత్ కుమార్. ఈయనకు తమిళంతో పాటు తెలుగులో కూడా చాలా మంది అభిమానులున్నారు. సినిమా తర్వాత సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు సైతం అజిత్ గట్టి పోటి ఇస్తున్నారు. ప్రస్తుతం అజిత్ మాస్ హీరోగా మారిపోయి అనేక విజయాలు తన ఖాతాలో వేసుకుంటున్నారు. కాగా, అజిత్ ఇటీవల మరో వ్యాపారానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఏకే మోటో రైడ్స్ అనే కంపెనీ ఏర్పాటు చేసి ఔత్సాహిక మోటో రైడర్స్ కి సహకారం అందించే ప్లాన్ లో ఉన్నారు.

ఇక విషయానికొస్తే.. నటి మీనా, అజిత్ కలిసి గతంలో ఆనంద పూంకట్రు అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ అప్పట్లో మంచి విజయం సాధించడంతో అజిత్ కు ఉత్తమ నటుడిగా అవార్డు కూడా దక్కింది. ఈ సందర్భంగా ఓ వేదికపై అజిత్ కు మీనా అవార్డు ఇచ్చింది. ఇక ఆ శుభ సందర్భంలో.. అజిత్, మీనా కలిసి స్టేజ్ పై డ్యాన్స్ చేయాలంటూ హోస్ట్ కోరాడు. ఇది విన్న మీనా తల్లి.. వెంటనే స్టేజ్ మీదకు వచ్చి మీనా చేయి పట్టుకుని తీసుకెళ్లింది. మీనా తల్లి అలా చేయడంతో అజిత్ అందరి ముందు అవమానించబడ్డాడు. అయితే మీనా తల్లి అందరూ చూస్తుండగానే ఇలా చేయడంతో ఆమె తీరుపై కొందరు నటులు తప్పుబట్టినట్లు వార్తలు కూడా వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: