నాగార్జున గారిని చూసి నాకు అలాంటి భర్త కావాలి అనుకున్నాను : పవిత్ర

murali krishna
పవిత్ర లోకేష్  ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సెన్సేషన్ గా మారిన పేర్లలో ఆమె ఒకటి. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇండస్ట్రీ లో ఎంతో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నారు.
ఇలా పలు సినిమాల లో నటిస్తూ మంచి గుర్తింపు పొందిన ఈమె నటుడు నరేష్ తో రిలేషన్ ఉంటున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలు నిజమేనని వీరిద్దరూ ప్రకటించడమే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనీ అయితే ప్రకటించారు. ఇలా నరేష్ వ్యవహారం తో పవిత్ర ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా వీరిద్దరూ జంటగా మళ్లీ పెళ్లి  సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చారు.
ఈ సినిమా మే 26 న విడుదల అయ్యి మిశ్రమ స్పందన ను లభించుకుంది. ఈ సినిమా విడుదల కు ముందు నరేష్ పవిత్ర లోకేష్ వరుస ఇంటర్వ్యూల లో అయితే పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ లో భాగం గా నరేష్ పవిత్ర లోకేష్ ఎన్నో విషయాలను కూడా వెల్లడించారు.ఈ సందర్భం గా పవిత్ర లోకేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. నాకు ఇద్దరు హీరోలు అంటే క్రష్ అని కూడా తెలియజేశారు.నేను స్కూల్లో చదువుతున్నప్పుడు నాగార్జున గారు నటించిన గీతాంజలి  సినిమా విడుదలైంది అయితే ఈ సినిమా చూసినప్పుడు ఆయనంటే నాకు ఎంతో క్రష్ ఏర్పడింది. నాకు భర్త అంటూ ఉంటే అలాంటి వ్యక్తి ఉండాలన్న ఫీలింగ్ నాగార్జున గారిని చూస్తే నే కలిగిందని పవిత్ర లోకేష్ తెలియజేశారటా.ఇక నాగార్జున తర్వాత అదే రేంజ్ లో తనకు నచ్చినటువంటి వారి లో నటుడు ప్రకాష్ రాజ్ ఒకరని కూడా తెలియజేశారు. నాగార్జున ప్రకాష్ రాజ్ ఇద్దరు నా క్రష్ అంటూ ఈ సందర్భం గా పవిత్ర లోకేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: