ఆ రెండు క్రేజీ సినిమాల ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రెండు మంచి క్రేజ్ ఉన్న సినిమాలు మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్నాయి. ఆ మూవీ ల యొక్క ఓవర్ సీస్ హక్కులను ఇప్పటికే ఈ మూవీ సంస్థ అమ్మి వేసింది. ఆ సినిమాలు ఏవి ... ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను ఏ సంస్థలు దక్కించుకున్నాయో తెలుసుకుందాం.
సామజవరగమన : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుల్లో ఒకరు అయినటువంటి శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు తన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ నటుడు ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. గ
త కొద్ది కాలంగా ఈ హీరో వరస అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురుకుంటున్నాడు. కొంత కాలం క్రితం ఈ నటుడు అల్లూరి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. తాజాగా శ్రీ విష్ణు సామజవరగమన అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతోంది. ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను సరిగమ సినిమాస్ సంస్థ దక్కించుకుంది.
ఊరి పేరు భైరవకోన : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న సందీప్ కిషన్ ఈ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను కూడా సరిగమ సినిమాస్ సంస్థ దక్కించుకుంది. వి ఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: