ఈ
మూవీ కి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నాడు అను ఇమ్మానుయేల్
హీరోయిన్ గా నటిస్తున్న ఈ
మూవీ లో
సునీల్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ
మూవీ ని
దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు తాజాగా ఈ
మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇది వరకు కార్తీ హీరోగా
లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన
ఖైదీ మూవీ ని కూడా
దీపావళి సందర్భంగా
థియేటర్ లలో విడుదల చేశారు. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది.
కార్తి ఆఖరుగా సర్దార్ అనే స్పై యాక్షన్ ధ్రిల్లర్
మూవీ లో
హీరో గా నటించాడు.
ఈ
సినిమా కూడా
దీపావళి సందర్భంగా విడుదల అయ్యి
బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటికే కెరియర్ లో రెండు సార్లు
దీపావళి సందర్భంగా తన సినిమాలను విడుదల చేసి
బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్న
కార్తి "జపాన్"
మూవీ ని కూడా
దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నాడు. మరి ఈ సారి కూడా ఈ
హీరో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.