అల్లు అర్జున్ తదుపరి మూవీ లకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన బన్నీ వాసు..!

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ నటుడు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాల్లో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు కి బన్నీ వాస్ కు ఎంత సాన్నిహిత్యం ఉంటుందో మన అందరికీ తెలిసిందే. దాదాపు బన్నీ చేయబోయే ప్రతి సినిమాకు సంబంధించిన ... అలాగే చేయబోయే ప్రతి సినిమాకు సంబంధించిన విషయాలు ఇతని కి తెలుస్తూ ఉంటాయి. అంతటి సాహిత్యం కలిగిన ఈయన తాజాగా అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన అనేక విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ వాసు ... అల్లు అర్జున్ తదుపరి మూవీ లకు గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా బన్నీ వాసు మాట్లాడుతూ ... ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప పార్ట్ 2 మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందబోయే ఒక సినిమాలో అల్లు అర్జున్ నటించబోతున్నాడు. ఈ మూవీ వచ్చే సంవత్సరం ప్రారంభం కాబోతోంది. 

ఇది ఇలా ఉంటే చాలా రోజులుగా షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్ అనే మూవీ లో అల్లు అర్జున్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు అని అనేక వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ వార్తలపై తాజా ఇంటర్వ్యూ లో స్పందించిన బన్నీ వాసు ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం జవాన్ మూవీలో అల్లు అర్జున్ ఎలాంటి పాత్రలో కూడా నటించడం లేదు అని బన్నీ వాసు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: