చిన్నసినిమాకు మహేష్ పెద్దమనసు !

Seetha Sailaja
ఈమధ్య కాలంలో ఎవరూ ఊహించని రీతిలో కొన్ని చిన్నసినిమాలు సూపర్ హిట్ అయి ఆసినిమాల నిర్మాతలకు బయ్యర్లకు కోట్లు కురిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి ఈవారం విడుదలకాబోతున్న చిన్నసినిమా ‘మేము ఫేమస్’ వచ్చి చేరుతుందా అన్నసందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో చాలమందికి కలుగుతున్నాయి.

ఈవారం చాల సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ ఆ సినిమాలలో ఎక్కువ పబ్లిసిటీ ‘మళ్ళీ పెళ్ళి’ మూవీ పై జరిగింది. ఈ మూవీ సీనియర్ నరేష్ వ్యక్తిగత జీవితం ఆధారంగా తీసిన సినిమా కావడంతో చాల ధియేటర్లు ఆసినిమాకు ఇచ్చారు. అయితే ఇప్పుడు ‘మేము ఫేమస్’ మూవీ ఒక్కసారిగా వార్తలలోకి వచ్చింది. ఈసినిమా ప్రీమియర్ షోలను చూసిన కొందరు ఈమూవీ చాల బాగుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.  

అయితే ఎవరూ ఊహించని విధంగా ఈమూవీకి మహేష్ సపోర్ట్ దొరకడమే కాకుండా ఈమూవీ చాలబాగుంది అంటూ ప్రశంసలు కురిపించడమే కాకుండా ఈమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అంటూ మహేష్ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రశంసలు కురిపించడంతో ఈసినిమాలో ఏముంది అంటూ విపరీతమైన ఆశక్తి చూపెడుతున్నారు. ఈసినిమాలోని నటీనటుల నటన అద్భుతం అనీ ముఖ్యంగా హీరో కమ్ డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ టాలెంట్ కి తాను ఫిదా అయిపోయాను అంటూ మహేష్ కామెంట్ చేసాడు.

సాధారణంగా మహేష్ ఒక సినిమా గురించి అంతగా మాట్లాడడు. తన సినిమా ఫెయిల్ అయితే వెంటనే అంగీకరిస్తాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ చాలా డిఫరెంట్ గా చేశారు. చాలా మంది సెలబ్రెటీలు ప్రమోట్ చేయడంతో ఈమూవీ గురించి చాలామందికి తెలిసిపోయింది. కేవలం యూత్ ను మాత్రమే కాకుండా ఫ్యామిలీ ప్రేక్షకులను కూడ పూర్తిగా నవ్వించడానికి నిద్దు విడుదల అవుతోంది. దీనితో ఈ వారం విజేతగా ఈసినిమా నిలుస్తుందా అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి.ఈ సినిమాతో సుమంత్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ గా రైటర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. అయితే అనేక షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవం ఇతనికి ఉంది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: