బాలయ్య వరుస హిట్లు కొడుతూ ఫుల్ హుషారు లో ఉన్నారు. వరుస సినిమాలు చేస్తునే...మరో పక్క అన్ స్టాపబుల్ అంటూ బాగా దూసుకుపోతున్నాడు
అలాగే పొలిటికల్ గాను యాక్టివ్ గా ముందుకు సాగుతున్నారు .. ఇదే క్రమంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ గా
బాలయ్య రెడీ అయినట్టు సమాచారం..
బాలకృష్ణ ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ సెట్ చేశారని
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇటీవల ప్రకటించారటా.. . త్వరలో తాము కలిసి నటించబోతున్నామని, దాన్ని తానే నిర్మిస్తున్నట్టు కూడా ఆయన వెల్లడించారని సమాచారం.. ఇక ఇందులో రజనీకాంత్ కూడా నటిస్తారని సమాచారం.
శివరాజ్ కుమార్ సొంత ప్రొడక్షన్లో నిర్మించబోతున్న ఈ సినిమాకి
కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వం వహిస్తారని తెలుస్తుంది .
అంతకు ముందు ఆయన బజరంగీ సినిమాని రూపొందించారు. అలాగే శివరాజ్‌కుమార్‌తో వేద సినిమాని కూడ రూపొందించారు.ఈ రెండు కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి.ఇక ఈ
సినిమా రెండు పార్ట్ లు కాదు, మూడు పార్ట్ లుగా రాబోతుందని తాజాగా మరో టాక్ కూడా వినిపిస్తుందటా మొదటి పార్ట్ లో
బాలకృష్ణ,
శివరాజ్ కుమార్ రెండో పార్ట్ లో
బాలకృష్ణ, రజనీ కాంత్ నటిస్తారని అయితే తెలుస్తుంది. అటు రజనీకాంత్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ కూడా వినిపిస్తుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.
బాలయ్య, రజనీ,
శివరాజ్ కుమార్ వంటి ముగ్గురు
మాస్ హీరోలు కలిసి
సినిమా అంటే దానిపై భారీ అంచనాలు వున్నాయి.ఇక మూడో భాగంలో లోకనాయకుడు కమల్ హాసన్, మలయాళ
సూపర్ స్టార్ మోహన్‌లాల్ కూడా నటిస్తున్నారని... మూడో భాగంలో బాలయ్యగానీ, రజనీ,
శివరాజ్ కుమార్ గానీ కనిపించరని, పూర్తిగా కొత్త స్టార్స్ కమల్, మోహన్‌లాల్ కలిసి నటిస్తారని అయితే సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సౌత్‌లో సంచలనంగా మారిందటా.ఈ ప్రాజెక్ట్ సంచలనాత్మక ప్రాజెక్ట్ గా నిలుస్తుంది.