చిరు పై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయశాంతి...!!
వాళ్ళ కాంబినేషన్ ఒక్కసారి హిట్ అయితే చాలు, అదే కాంబినేషన్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు.
అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి చిరంజీవి - విజయశాంతి కాంబినేషన్.వీళ్లిద్దరి కాంబినేషన్ లో దాదాపుగా 25 సినిమాలు వచ్చాయి.
వాటిల్లో 90 శాతం వరకు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి.విజయశాంతి కి లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా సూపర్ స్టార్ స్టేటస్ వచ్చినప్పటికీ కూడా చిరంజీవి( chiranjeevi ) తో గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలు చేసింది.
ఈ చిత్రానికి ఆమె మెగాస్టార్ తో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుందని అప్పట్లో ఒక టాక్ సెన్సేషన్ సృష్టించింది.ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఆమె చిరంజీవి తో కలిసి నటించలేదు.పాతిక సినిమాలలో ఇదే చివరి చిత్రం అని చెప్పొచ్చు.
ఇక ఆ తర్వాత ఆమె 1990 దశకం లోనే దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఒసేయ్ రాములమ్మ( Osei Ramulamma ) చిత్రం చేసి ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.ఈ సినిమా తర్వాత ఆమె రేంజ్ మామూలు స్థాయిలో లేదు, అలాంటి సమయం లో ఆమె తన కెరీర్ ని త్యాగం చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.అలా రాజకీయ ప్రస్థానం ని మొదలు పెట్టిన విజయశాంతి పొలిటికల్ కెరీర్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, మన కళ్ళతో చూస్తూనే ఉన్నాం.
అయితే విజయశాంతి( vijayashanti ) మనసులో ఒకటి ఉంచుకొని, బయటకి ఒకటి మాట్లాడే రకం కాదు.మనసులో ఏది ఉన్నా నిర్మొహమాటం గా బయటకి చెప్పే గుణం విజయశాంతి సొంతం.
గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె చిరంజీవి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.అప్పట్లో ఆ వ్యాఖ్యలు మీడియాలో ఒక రేంజ్ లో క్లిక్ అయ్యాయి.
ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సినీ పరిశ్రమకి ఎంతో ఇచ్చారు, కానీ సినీ పరిశ్రమకి చెందిన వాళ్ళు తెలంగాణ కి అంత అన్యాయం జరుగుతుంటే ఒక్కరైనా మాట్లాడారా?, చిరంజీవి గారు పార్టీ పెట్టాడు, తెలంగాణ ప్రజల కోసం ఏమి పోరాటం చేసాడు.అందరూ ముసుగు దొంగలే, ఎవరికీ ధైర్యం లేదు అంటూ విజయ శాంతి చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి.ఇక మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుండి సంపూర్ణంగా తప్పుకోగా, విజయ శాంతి మాత్రం ఇప్పటికీ యాక్టీవ్ పాలిటిక్స్ లో చురుగ్గా పాల్గొంటుంది.
ప్రస్తుతం ఆమె బీజేపీ పార్టీ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ చిత్రం లో ఒక పవర్ ఫుల్ పాత్రని పోషించి అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చినా, ఆ తర్వాత అది కొనసాగించడానికి ఆమె సిద్ధంగా లేనని, తన పూర్తి ద్రుష్టి మొత్తం రాజకీయాల మీదనే ఉందని చెప్పుకొచ్చింది.
ఆమె ఒప్పుకుంటే పవర్ ఫుల్ పాత్రలు ఇచ్చి కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చే దర్శక నిర్మాతలు ఉన్నప్పటికీ విజయ్ శాంతి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే ప్రజాసేవ అంటే ఆమెకి ఎంత కమిట్మెంట్ ఉందో అర్థం అవుతుంది.