తెలుగు
సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగి
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ
త్రిష గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
త్రిష తెలుగు తో పాటు అనేక
తమిళ సినిమాల్లో నటించి
కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి
కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా స్టార్
హీరోయిన్ గా ఎన్నో సంవత్సరాలు కొరియర్ ను కొనసాగించింది.
ప్రస్తుతం కూడా
కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ వరుస
సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. ఇది ఇలా ఉంటే తెలుగు మరియు
తమిళ భాషల్లో ఈ ముద్దుగుమ్మ కొంతమంది హీరోలతో మూడు అంతకంటే ఎక్కువ సినిమాల్లో నటించింది. అలా
త్రిష తెలుగు మరియు
తమిళ సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోలతో మూడు అంతకంటే ఎక్కువ సినిమాల్లో నటించిందో తెలుసుకుందాం.
ప్రభాస్ హీరోగా రూపొందిన వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో
త్రిష నటించింది.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరు అయినటువంటి
విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, నమో వెంకటేశ,
బాడీగార్డ్ సినిమాలలో
త్రిష నటించింది.
తమిళ
హీరో సూర్య నటించిన మౌనం పిసియాదే, ఆయుత ఎలుక్కు, ఆరు సినిమాల్లో
త్రిష నటించింది.
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు అయినటువంటి
అజిత్ హీరోగా రూపొందిన జి , కిరీడం , మంకద , యెన్నై అరిందల్ సినిమాల్లో
త్రిష నటించింది.
కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా కెరీర్ కొనసాగిస్తున్న
విక్రమ్ హీరోగా రూపొందిన సామి, బీమా, పోనియన్ సెల్వన్ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాల్లో
త్రిష నటించింది.
జయం
రవి హీరోగా రూపొందిన ఉన్నకుమ్ ఏనకుమ్మ్, సకలకళ వల్లవన్, భూలోహం, పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాల్లో
త్రిష నటించింది.
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు అయినటువంటి తలపతి
విజయ్ హీరోగా రూపొందిన గిల్లి, తిరుపాచి, ఆది, కురివి సినిమాల్లో
త్రిష నటించింది. ప్రస్తుతం విజయ్...
త్రిష కాంబినేషన్లో లియో
మూవీ రూపొందుతుంది.