టాలీవుడ్ స్టార్
హీరో పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తు దూసుకుపోతున్నాడు.అందులో భాగంగా ఆయన వినోదయ సీతమ్ అనే
తమిళ సినిమాకు రీమేక్‌గా ఓ సినిమాను కూడా చేస్తున్నారు.మంచి కంటెంట్‌తో వచ్చిన ఈ
సినిమా తమిళ్‌లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాను తెలుగులో ప్రముఖ స్టార్
డైరెక్టర్ ఇంకా నటుడు అయిన
సముద్రఖని దర్శకత్వంలో
రీమేక్ చేస్తున్నారు. పీపుల్స్
మీడియా సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ
సినిమా ఒరిజినల్‌లో
సముద్రఖని నటించడమే కాదు ఈ సినిమాను అద్భుతంగా డైరెక్ట్ కూడా చేశారు. ఇక తమిళ్‌లో
సముద్రఖని చేసిన పాత్రలో పవన్ కనిపిస్తుండగా.. తంబి రామయ్య అనే మరో కీలక పాత్రలో యంగ్
హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ
సినిమా పవన్
కళ్యాణ్ గతంలో నటించిన
గోపాల గోపాల సినిమాకు కాస్తా దగ్గరగా ఉంటుంది. అది అలా ఉంటే ఈ
సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఈరోజు సాయంత్రం 4:14 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. దీని గురించి టీమ్ ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న
ఎస్ ఎస్ థమన్ తాజాగా ఈ ఈవిషయంలో ఒక పోస్ట్ ను షేర్ చేశారు. సాయంత్రం 4:14 గంటలకు ఫైర్ అంటూ అతను చెప్పుకొచ్చారు.
ఇక ఇప్పుడు ఈ
సినిమా గురించి లేటెస్ట్‌గా ఓ వార్త వైరల్ గా మారింది. ఇంతకీ విషయం ఏమంటే.. ఈ సినిమాకు మొదట
నాగార్జున సంతోషం సినిమాలో దేవుడే దిగి వచ్చిన అనే పాటను టైటిల్‌గా పెట్టనున్నారని టాక్ వినిపించింది. అయితే ఈ సినిమాకు బ్రో అనే పేరు కంఫర్మ్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి తేజ్‌ను పవన్ బ్రో అని పిలుస్తారట.అందుకే ఈ సినిమాకు బ్రో అని పెట్టారట.అంతేకాదు, ఈ పేరును టీం రిజిస్టేషన్ కూడా చేశారట.అయితే
నెటిజన్స్ మాత్రం ఇదేంట్రా బాబు టైటిల్ మరి ఇంత ఘోరంగా ఉందని కూడా అంటున్నారు. ఇక ఈ
సినిమా కోసం ఇప్పటికే పవన్
కళ్యాణ్ తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు.ప్రస్తుతం ఆయన ఓజీ షూటింగ్‌లో కూడా పాల్గోంటున్నారు. ఈ వినోదయ సీతమ్ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు సాయిధరమ్ తేజ్, కేతికశర్మ, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళభరణి, సుబ్బరాజు,
ప్రియా ప్రకాష్ వారియర్ ఇంకా
రాజా చెంబోలు కూడా నటిస్తున్నారు.