మేమ్ ఫేమస్ ట్రైలర్.. మరో జాతిరత్నాలు లోడింగ్..!

shami
ఈమధ్య కొన్ని సినిమాలు యూత్ టార్గెట్ తో చేస్తూ సత్తా చాటుతున్నాయి. సినిమా యూత్ ఆడియన్స్ కి నచ్చింది అంటే పక్కా హిట్ అయినట్టే లెక్క. స్టార్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే యూత్ ఆడియన్స్ ని కరెక్ట్ గా ఫోకస్ చేసేలా సినిమాలు చేస్తే సినిమా బిజినెస్ జరిగినట్టే లెక్క. ఈ క్రమంలో జాతిరత్నాలు తో సూపర్ సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. లేటెస్ట్ గా అలాంటి సినిమానే మరోటి వస్తుంది. అదే మేమ్ ఫేమస్. ఈ సినిమాను సుమంత్ ప్రభాస్ డైరెక్ట్ చేశాడు. కేవలం డైరెక్షన్ మాత్రమే కాదు అతనే హీరోగా నటించాడు.
లేటెస్ట్ గా మేమ్ ఫేమస్ ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ చూస్తే మరో యూత్ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ మూవీ వస్తుందని అనిపిస్తుంది. చాయ్ బిస్కెట్ ప్రొడక్షన్ లో ఈ సినిమాను అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ నిర్మించారు. సినిమాలో సుమంత్ ప్రభాస్ తో పాటుగా మని, మౌర్యా, కిరణ్ మచ్చ, అంజిమామ తదితరులు నటించారు. ఈ ట్రైలర్ చూసే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పనీపాటలేని ఒక గ్యాంగ్ చేసే అల్లరి నేపథ్యంతో తెరకెక్కినట్టు తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్ మాత్రం ఇంప్రెస్ చేసింది.
చూస్తుంటే జాతిరత్నాలు సినిమా తరహాలో యూత్ ఆడియన్స్ ని అలరించేలా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా భారీగా చేస్తున్నారు. చాయ్ బిస్కెట్ ఇదివరకు ఆల్రెడీ రెండు సినిమాలను నిర్మించగా ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తుంది. రైటర్ కం డైరెక్టర్ గానే కాదు నటుడిగా కూడా సుమంత్ ప్రభాస్ ఈ సినిమాకు బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపిస్తుంది. మరి మేమ్ ఫేమస్ సినిమా ప్రేక్షకుల నుంధి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా విషయంలో మేమ్ యూనిట్ అంతా నమ్మకంగా ఉన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: