అలాంటోడే.. నాకు భర్తగా కావాలి : కృతిశెట్టి

praveen
సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి రాణించాలి అంటే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని అంటూ ఉంటారు. అయితే ఇలాంటి అదృష్టాన్ని కలిగి ఉంది అంటూ పేరు సంపాదించుకుంది కృతిశెట్టి. ఉప్పెన అనే ఒక చిన్న సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అయితే ఇది చిన్న సినిమా అయినప్పటికీ సెన్సేషన్  విజయాన్ని సాధించింది అని చెప్పాలి. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడంతో కృతి శెట్టి పేరు ఇండస్ట్రీ మొత్తం మారుమోగిపోయింది.

 ఇక దర్శక నిర్మాతలు అందరూ కూడా తమ సినిమాల్లో ఈ హీరోయిన్ పెట్టుకోవడానికి తెగ ఆసక్తి చూపారు. అయితే ఉప్పెన సినిమా తర్వాత కృతిశెట్టి నటించిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో లక్కీ హీరోయిన్గా కూడా పేరు సంపాదించుకుంది. కానీ ఈ అమ్మడి వెంట అదృష్టం కొన్నాళ్లే ఉంది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే కొంతకాలం నుంచి కృతి శెట్టి చేస్తున్న సినిమాలు పెద్దగా ఆడటం లేదు. అవకాశాలు వస్తున్న ఆ సినిమాలు మాత్రం హిట్ అవడం లేదు. అయితే ఇటీవల నాగచైతన్య సరసన కస్టడీ అనే సినిమాలో నటించి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

 అయితే ఈ సినిమా కూడా మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ సొంతం  చేసుకుంది. అయితే సినిమాల విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతిశెట్టి పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయాలను చెప్పుకొచ్చింది కృతిశెట్టి. అందంగా ఉండనక్కర్లేదు. ఆస్తి పెద్దగా ఉండాల్సిన పనిలేదు. మంచి మనసున్న వాడు అయితే చాలు. అయితే మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలి. ఎంత ఎదిగినా ఒతికి ఉండే మనస్తత్వంతో ఉండాలి. కాస్త బొద్దుగా కూడా ఉంటే ఇష్టం అంటూ ఈ హీరోయిన్  చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: