ఐ కాన్ స్టార్
అల్లు అర్జున్ కొంత కాలం క్రితం విడుదల అయినటు వంటి పుష్ప పార్ట్ 1
మూవీ తో పాన్
ఇండియా రేంజ్ లో అదిరిపోయి రేంజ్ గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ
మూవీ కి
సుకుమార్ దర్శకత్వం వహించగా ... నేషనల్
క్రష్ రష్మిక మందన ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటించింది. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ
మూవీ లో
సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించగా ... రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్ ఈ
మూవీ కి సంగీతం అందించాడు.
మలయాళ నటుడు ఫాహద్
ఫజిల్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో
రావు రమేష్ ,
సునీల్ ,
అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ
మూవీ ఈ యొక్క రెండవ భాగం షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఈ
మూవీ యొక్క రెండవ భాగం షూటింగ్ కూడా కొంత వరకు పూర్తి అయ్యింది. ఇది ఇలా ఉంటే పుష్ప
మూవీ తర్వాత
అల్లు అర్జున్ నటించబోయే
మూవీ ని ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప పార్ట్ 2
మూవీ తర్వాత
అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోయే
మూవీ లో
హీరో గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
మరి కొన్ని రోజుల్లోనే ఈ
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విలువడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
త్రివిక్రమ్ ... సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ
మూవీ పూర్తి అయిన తర్వాత
అల్లు అర్జున్ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే
అల్లు అర్జున్ ...
త్రివిక్రమ్ కాంబినేషన్ లో
జులాయి ...
సన్నాఫ్ సత్యమూర్తి ... అలా వైకుంఠపురంలో
మూవీ లు రూపొందాయి.