రజనీ కాంత్ కూతురు
ఐశ్వర్య ...
ధనుష్ హీరో గా రూపొందినటువంటి "3"
మూవీ తో మొట్ట మొదటి సారి మెగా
ఫోన్ పట్టింది. మొదటి సారి దర్శకత్వం వహించినప్పటికీ "3"
మూవీ తో
ఐశ్వర్య దర్శకురాలిగా అద్భుతమైన ప్రశంసలను అందుకుంది. ఆ తర్వాత పలు
మూవీ లకు దర్శకత్వం వహించిన
ఐశ్వర్య ప్రస్తుతం "లాల్ సలాం" అనే సినిమాకు దర్శకత్వం వహిస్తుంది. విష్ణు విశాల్ మరియు
విక్రాంత్ లు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను
ఐశ్వర్య స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో రూపొందిస్తోంది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో
సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులు గా వార్తలు బయటకు వస్తున్న అందరికీ తెలిసిందే. అలాగే చాలా రోజుల క్రితమే ఈ విషయాన్ని ఈ
మూవీ యూనిట్ కూడా అధికారికం గా ధృవీకరించింది. తాజాగా లాల్ సలాం
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి
సూపర్ స్టార్ రజనీ కాంత్ కు సంబంధించిన ఫస్ట్ లుక్
పోస్టర్ ను విడుదల చేసింది.
అలాగే ఈ సినిమాలో రజనీ కాంత్ ఏ పాత్రలో కనిపించబోతున్నాడో కూడా తెలియజేసింది. లాల్ సలాం
మూవీ లో రజనీ కాంత్ "మోద్దీన్ బాయ్" పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ చిత్ర బంధం అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ
మూవీ యూనిట్ విడుదల చేసిన
పోస్టర్ లో వెనకాల గొడవలు జరుగుతూ ఉంటే అందులో నుండి అగ్గి మంటలు వస్తున్న సమయంలో రజిని స్టైలిష్ లుక్ లో నడుచుకుంటూ వస్తున్న
పోస్టర్ ను ఈ
మూవీ బృందం విడుదల చేసింది. ఈ
పోస్టర్ కు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది.
v