పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ప్రస్తుతం వరుస
మూవీ లకు కమిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పవన్ తమిళం లో మంచి విజయం సాధించినటు వంటి వినోదయ సీతం అనే
మూవీ ని తెలుగు లో
రీమేక్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ లో పవన్ తో పాటు
సాయి ధరమ్ తేజ్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ యొక్క షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. అలాగే ఈ
మూవీ లో పవన్ తనకు సంబంధించిన భాగం షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.
మరి కొన్ని రోజుల్లోనే ఈ
మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ ని
జూన్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకున్నప్పటికీ ఈ
మూవీ టైటిల్ ను మాత్రం ఈ
మూవీ యూనిట్ ఇప్పటి వరకు ప్రకటించలేదు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా యొక్క టైటిల్ ను మరో రెండు రోజుల్లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు ఒక టైటిల్ ను కూడా కన్ఫామ్ చేసినట్లు సమాచారం. ఈ
మూవీ మేకర్స్ ఈ సినిమాకు "బ్రో" అనే టైటిల్ ను కన్ఫామ్ చేసినట్లు గాను ... మరో రెండు రోజుల్లో ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ కి
సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ
మూవీ రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ
సినిమా కథలో అనేక మార్పులు ... చేర్పులు చేసినట్లు తెలుస్తోంది.