"ఉగ్రం" మూవీకి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
కెరీర్ ప్రారంభంలో ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న సినిమాలలో నటించిన అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో మాత్రం ఎక్కువ శాతం సీరియస్ పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా నరేష్ "ఉగ్రం" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నరేష్ సిన్సియర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నిన్న అనగా మే 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 23 లక్షల కలక్షన్ లను వసూలు చేయగా , సీడెడ్ ఏరియాలో 10 లక్షలు , యూఏ లో 7 లక్షలు , ఈస్ట్ లో 5 లక్షలు , వెస్టులో 3 లక్షలు , గుంటూరులో 5 లక్షలు , కృష్ణ లో 5 లక్షలు , నెల్లూరులో 3 లక్షలు , కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లో కలుపుకొని ఈ సినిమా 12 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు 73 లక్షల షేర్ ... 1.45 కోట్ల గ్రాస్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 5.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 6.50 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హీట్ గా నిలుస్తుంది. మరో 5.77 కోట్ల షేర్ కలక్షన్ లను ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: