చిరంజీవి చిత్రంలో శ్రీ లీల..!!

Divya
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హీరోయిన్ శ్రీలీల. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల చిత్రాలలో కూడా ఈమె కీలకమైన పాత్రలలో నటించడమే కాకుండా హీరోయిన్గా కూడా నటిస్తోంది. తన పాత్ర నచ్చితే ఎలాంటి రోల్స్ ల్లోనైనా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ విధంగా కూడా ప్లస్ అవుతుందని ఈమె అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు. నిన్నటి రోజున విజయ్ దేవరకొండ, శ్రీలీల కలిసి ఒక చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి.


బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో కూడా బాలయ్య కూతురు పాత్రలో నటిస్తోంది  శ్రీలీల. అలాగే పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా చిరంజీవి కళ్యాణ కృష్ణ డైరెక్షన్లో రాబోతున్న సినిమాలో కూడా హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో సిద్దు జొన్నలగడ్డ కనిపించబోతున్నారని ఆపాత్రకు జోడిగా శ్రీ లీల ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతినిండా వరస సినిమాలతో బిజీగా ఉన్నది. కెరీర్ను మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తోంది.


శ్రీలీల రెమ్యూనరేషన్ సైతం పరిమితంగానే ఉండడంతో దర్శక నిర్మాతలు కూడా ఎక్కువగా ఈమెకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోలు మీడియం రేంజ్ హీరోలు కూడా ఈమెకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. చిరంజీవి సినిమాల శ్రీ లీల నటించబోతుందా లేదా అనే విషయంపై ఇంకా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నది. టాలీవుడ్ లో మాత్రం ప్రస్తుతం శ్రీ లీల పేరు ఎక్కువగా వినిపిస్తోంది సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చిరంజీవి ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. తన సినిమాలలో మరో హీరో ఉండేలా కెరీర్ ని ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు చిరంజీవి ఈ విధంగా చేయడం ద్వారా సినిమాలకు మరింత ప్లస్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: