పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి వి వి ధానయ్య ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉండగా ... ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ ... పవన్ సరసన హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ముంబై లో ప్రారంభం అయింది.
ఈ మూవీ షూటింగ్ లో పవన్ టి పాటు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక కూడా ఇప్పటికే జాయిన్ అయింది. అలాగే వీరిద్దరిపై కొన్ని కీలక సన్నివేశాలను కూడా ఈ మూవీ యూనిట్ చిత్రీకరించింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి కాగా మరి కొన్ని రోజుల్లో ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
ఇది వరకు పవన్ తన కెరీర్ లో బాలు ... పంజా మూవీ లలో గ్యాంగ్ స్టార్ పాత్రల్లో నటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ 17 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు కొన్ని కీలక సన్నివేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ కొడుకు అయినటువంటి అకిరా నందన్ నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ వార్త కనుక నిజం అయితే పవన్ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. "ఓజి" మూవీ పై పవన్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.