అఫీషియల్ : "రామబాణం" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేదిక ఖరారు..!

Pulgam Srinivas
మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రామబాణం లో హీరో గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో జగపతి బాబు ... కుష్బూ కీలక పాత్రలలో నటించగా ... శ్రీ వాసు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో డింపుల్ హయాతి ... గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించగా ... మిక్కీ జే మేయర్ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని మే 5 వ తేదీన థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.


 ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూ లను నిర్వహిస్తూ ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది.


మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 30 వ తేదీన సాయంత్రం 6 గంటలకు "జే ఆర్ సి" కన్వెన్షన్స్ ... హాల్ 2  ... ఫిలిం నగర్ ... హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ తేదీ , సమయం మరియు వేదిక ఖరారు చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో గోపీచంద్ మరియు జగపతి బాబు లు ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: