ఇండియాలో అత్యంత క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే
మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ యొక్క మొదటి భాగం పోయిన సంవత్సరం
తమిళ్ , తెలుగు ,
కన్నడ , మలయాళం ,
హిందీ భాషలలో విడుదల అయింది. ఈ
మూవీ యొక్క
తమిళ వర్షన్ ప్రేక్షకులను బాగానే ఆకట్టు కున్నప్పటికీ ఇతర భాష ప్రేక్షకులను మాత్రం ఈ
సినిమా అంతగా అకట్టు కోలేక పోయింది.
ఇది ఇలా ఉంటే మొత్తంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ
మూవీ యొక్క రెండవ భాగం నిన్న అనగా ఏప్రిల్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ
తమిళ్ , తెలుగు ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ మొదటి భాగంపై ఉన్నంత అంచనాలు రెండవ భాగం పై ప్రేక్షకుల్లో లేవు అని చెప్పవచ్చు. ఈ
మూవీ మొదటి భాగంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్న కారణంగా ఈ
మూవీ యొక్క మొదటి భాగానికి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు వచ్చాయి.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ యొక్క రెండవ భాగానికి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 53 కోట్ల కలెక్షన్ లు మాత్రమే వచ్చాయి. దీనిని బట్టి చూసుకుంటే ఈ
మూవీ మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగం 27 కోట్ల తక్కువ కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ
మూవీ లో చియాన్
విక్రమ్ , కార్తీ ,
జయం రవి ,
ఐశ్వర్య రాయ్ ,
త్రిష ,
శోభిత ధూళిపాల ,
ఐశ్వర్య లక్ష్మి ముఖ్య పాత్రలలో నటించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ
మూవీ కి సంగీతం అందించాడు.