మణిరత్నం నుండి రాబోతున్న ఎవరు ఊహించని కథ !

Seetha Sailaja

‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 2కు వస్తున్న ప్రశంసలతో మణిరత్నం ఖ్యాతి మరొకసారి జాతీయ్ మీడియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాజమౌళి లాంటి దర్శకుడు ఒక చారిత్రాత్మక సినిమాను హుందాగా ఎలాతీయాలో మణిరత్నం దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది అంటూ ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ కామెంట్ చేసింది అంటే ‘పొన్నియన్ సెల్వన్ 2’ కు వస్తున్న ప్రశంసలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం అవుతుంది.


ఈసినిమా ఊహించిన విజయాన్ని అందుకోవడంతో మణిరత్నం కమలహాసన్ ల కాంబినేషన్ లో రాబోతున్న మూవీ పై అప్పుడే లీకులు వస్తున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘నాయకుడు’ అప్పట్లో చరిత్ర సృష్టించింది. ఆతరువాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ రకరకాల కారణాలతో కుదరలేదు.


గత సంవత్సరం విడుదలైన కమలహాసన్ నటించిన ‘విక్రమ్’ ఊహించని ఘనవిజయం సాధించడంతో ఒక్కసారిగా కమలహాసన్ మార్కెట్ మళ్ళీ పెరిగిపోయింది. ప్రస్తుతం కమల్ శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ లో నటిస్తిస్తున్నాడు. ఈమూవీ తరువాత కమల్ మణిరత్నం దర్శకత్వంలో నటించే సినిమా ప్రారంభం అవుతుంది అని అంటున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలైందని అయితే ఎవరు ఊహించని తీరులో ఈమూవీ కథ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.  


చ‌నిపోయిన ఒక మ‌నిషి మ‌ళ్లీ బ్ర‌తికి స‌మాజంలోకి వ‌స్తే ఎదురయ్యే ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ సినిమా న‌డుస్తుంద‌ట‌. విన‌డానికి చాలా ఇంట్రెస్టింగ్‌ లైన్ గా అనిపిస్తున్న ఈకథలో చనిపోయి మళ్ళీ బ్రతికి వచ్చిన పాత్రలో కమలహాసన్ నటిస్తాడు అని తెలుస్తోంది. మొదట్లో కమల్ హాసన్ పక్కన ఈమూవీలో త్రిష లేదంటే నయనతార లను హీరోయిన్ గా ఎంపిక చేద్దాము అని అనుకున్నారట. అయితే ఇప్పుడు ఆపాత్రకు విద్యాబాలన్ ఎంపిక అయింది అంటున్నారు. ఈ సంవత్సరంలో షూటింగ్ మొదలుపెట్టి ఈమూవీని వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ చేసే విధంగా ఈమూవీని కమల్ హాసన్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది..    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: