పవన్ తో సినిమా పూర్తి కాకుండానే ఆ స్టార్ హీరో తో మరో సినిమా చేస్తున్న దర్శకుడు..!!

frame పవన్ తో సినిమా పూర్తి కాకుండానే ఆ స్టార్ హీరో తో మరో సినిమా చేస్తున్న దర్శకుడు..!!

murali krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమా ను మొదలు పెట్టిన దర్శకుడు క్రిష్ ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు.

సాధారణంగా ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేస్తూ దూసుకు పోయే క్రిష్ హరిహర వీరమల్లు సినిమా కారణంగా దాదాపు రెండు మూడు సంవత్సరాలు తన సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందట.హరిహర వీరమల్లు సినిమాను ప్రారంభించడానికి ముందు వైష్ణవ తేజ్ తో కొండ పొలం అనే విభిన్నమైన సినిమాను రూపొందించిన క్రిష్ అప్పటి నుండి ఇప్పటి వరకు హరిహర వీరమల్లుతోనే చాలా బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల అప్పుడప్పుడు మాత్రమే డేట్స్ ను ఇస్తున్నాడు. దాంతో షూటింగ్ సగం మాత్రమే పూర్తి అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం చివరి వరకు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ చేస్తూనే ఉంటాడని సమాచారం కూడా అందుతుంది.

ఒకవైపు రాజకీయాలతో పాటు మరో వైపు వరుసగా ఇతర సినిమాలను కమిట్ అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు డేట్స్ ఇవ్వడం లేకపోతున్నాడు అంటూ కొందరు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే దర్శకుడు క్రిష్ హరిహర వీరమల్లు సినిమా పూర్తి కాకుండానే మరో సినిమా పనిలో పడ్డాడు అంటూ సమాచారం కూడా అందుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి దర్శకుడు క్రిష్ స్టోరీ చెప్పాడని, ఆ స్టోరీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా వార్తలు వస్తున్నాయి. అదే కనుక నిజమైతే ఈ సంవత్సరం చివర్లోనే ప్రభాస్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది. హరిహర వీరమల్లు సినిమా పూర్తి కాకుండా మరో సినిమా పనిలో దర్శకుడు క్రిష్ పడడం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇక కొందరు క్రిష్ కి మద్దతుగా అయితే నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం ఎన్నాళ్లు వెయిట్ చేయాలి క్రిష్ అంటూ ఆయన అభిమానులు కూడా కామెంట్స్ చేస్తన్నారు. క్రిష్ వంటి టాలెంటెడ్ దర్శకుడు డేట్స్ వృధా అవ్వడం ఏ మాత్రం కూడా సరికాదు అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్రిష్ మరో సినిమాను మొదలు పెట్టేందుకు పవన్ కళ్యాణ్ నుండి గ్రీన్ సిగ్నల్  అయితే రావాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: