టాలీవుడ్ మాస్ హీరోల్లో ఒకరు అయినటువంటి గోపీచంద్ తాజాగా రామబాణం మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా ... జగపతి బాబు ... కుష్బూ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. శ్రీ వాసు ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇంకా ఈ మూవీ విడుదలకు కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ యూనిట్ అదిరిపోయే జోష్ లో ఈ సినిమా ప్రమోషన్ లను నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి రోజుకో పోస్టర్ ను విడుదల చేస్తూ వస్తోంది.
తాజాగా కూడా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదలకు ఇంకా కేవలం 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది అని తెలియ జేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో గోపీచంద్ మరియు డింపుల్ హయతి లు ఉన్నారు. ఇదివ రకు గోపీచంద్ ... శ్రీ వాస్ కాంబినేషన్ లో లక్ష్యం ... లౌక్యం మూవీ లు రూపొందాయి. ఈ మూవీ లు మంచి విజయాలు అందుకున్నాయి. మరి వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన మూడవ మూవీ రామబాణం కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ను అందుకుంటుందో లేదు తెలియాలి అంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే.