టాలీవుడ్ యంగ్
హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా
కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన
సినిమా విరూపాక్ష.
హర్రర్ థ్రిల్లర్
జోనర్ లో వచ్చిన ఈ
సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.సుప్రీం
హీరో సాయి ధరమ్ తేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్
బ్లాక్ బస్టర్ మూవీగా ఈ
సినిమా దూసుకుపోతుంది. ఇక బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు
టాలీవుడ్ స్టార్
డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు.ఈ మధ్యకాలంలో కంప్లీట్ గా
హర్రర్ జోనర్ లో వచ్చిన సినిమాగా విరూపాక్ష మూవీకి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ
సినిమా మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని సాధించడంతో పాటు 50 కోట్ల గ్రాస్ క్లబ్ లో కూడా చేరింది.ఇక ఇప్పటి దాకా మూవీకి వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే..ఏపీ తెలంగాణాలో మొదటి రోజు - 4.79 కోట్లు,రెండో రోజు - 5.80 కోట్లు,మూడో రోజు - 5.77 కోట్లు,నాలుగో రోజు - 3.01 కోట్లు,ఐదో రోజు - 2.40 కోట్లు, ఆరవ రోజు - 1. 84 కోట్ల వసూళ్లు వచ్చాయి.ఈ
సినిమా మొత్తంగా 23.61 కోట్ల షేర్ ని కేవలం
ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో సంపాదించడం విశేషం.
ఇకపోతే ఏరియాల వారీగా మొత్తం 6 రోజుల్లో వచ్చిన షేర్ కలెక్షన్స్ చూసుకుంటే..నైజాం లో 10.42 కోట్లు,సీడెడ్ లో 3.42 కోట్లు,యూఏలో 3.03 కోట్లు,తూర్పు
గోదావరి లో 1.65 కోట్లు,పశ్చిమ గోదావరిలో -1.16 కోట్లు,గుంటూరులో - 1.61 కోట్లు,కృష్ణాలో - 1.54 కోట్లు,నెల్లూరులో 76 లక్షలు ఇంకా రెస్ట్ ఆఫ్
ఇండియా కర్ణాటకలో 2.10 కోట్ల షేర్, అలాగే ఓవర్సీస్
మార్కెట్ లో 4.20 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఇక ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి దాకా 29.91 కోట్ల షేర్ తో 53. కోట్ల గ్రాస్ తేజ్
మూవీ కలెక్ట్ చేసి సూపర్ రికార్డులు సృష్టించింది. ప్రస్తుతానికి కూడా ఈ
మూవీ బాగానే కలెక్షన్స్ ని సాధిస్తూ ముందుకి వెళ్తోంది. ఈ
సినిమా మొత్తం 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా 23 కోట్లకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయ్యింది. ఇక ఇప్పటి దాకా వచ్చిన టోటల్ ప్రాఫిట్ 6 కోట్లు. ఇక ఏప్రిల్ 28 వ తేదీన ఏజెంట్ పొన్నియన్ సెల్వన్ 2 మూవీకి ఆశించిన టాక్ రాకుంటే మళ్ళీ వీకెండ్స్ లో విరూపాక్ష కలెక్షన్స్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.