నాలుగు రోజుల్లో.. 500 సిగరెట్లు తాగా : అల్లరి నరేష్

praveen
సినిమా ఇండస్ట్రీలో కామెడీ అనే పదానికి కొత్త అర్థం చెప్పిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది అల్లరి నరేష్ అనే చెప్పాలి. సాధారణంగా కేవలం కమెడియన్స్ మాత్రమే అటు సినిమాల్లో కామెడీ పంచుతారు అని అందరికీ తెలుసు. కానీ హీరోలు కూడా కామెడీ పంచుతారని.. కమెడియన్స్ కంటే ఎక్కువగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు అని నిరూపించాడు అల్లరి నరేష్. తన కెరీర్ మొత్తం కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలోనే నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అని చెప్పాలి. దీంతో ఇక  అల్లరి నరేష్ అంటే కేవలం ఒక కామెడీ హీరో మాత్రమే అని గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే అలాంటి అల్లరి నరేష్ ఇప్పుడు పూర్తిగా తన పంథా మార్చుకున్నాడు.

 ఒకప్పుడు విభిన్నమైన కాన్సెప్ట్ తో కామెడీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లరి నరేష్ ఇక ఇప్పుడు కామెడీ ఓరియంటెడ్ మూవీస్ కి గుడ్ బై చెప్పేశాడు. కేవలం వైవిద్యమైన సినిమాలు మాత్రమే చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటికి మొన్న నాంది అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలో నటించి ప్రేక్షకులకు సర్ప్రైస్ ఇచ్చాడు  ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత మారేడుపల్లి నియోజకవర్గం అనే సినిమాతోను ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లరి నరేష్.

 ఇక ఇప్పుడు ఉగ్రం అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది అని చెప్పాలి. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మీర్నమీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉగ్రం సినిమాలో ఒక ఫైట్ సీన్ కోసం కేవలం నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు తాగాను అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత తనకు దగ్గు జ్వరం వచ్చి ఆరోగ్యం పాడైంది అంటూ తెలిపాడు అల్లరి నరేష్. ఇక అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను ప్రాణం పెట్టి సినిమా చేశాడు అన్నది తెలుస్తుంది. మరి ఈ సినిమా అతనికి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: