వెంకటేష్ పొరపాట్ల పై ఆశక్తికర చర్చలు !
సీనియర్ హీరో వెంకటేష్ హిట్ అన్నపదం విని సంవత్సరాలు గడిచిపోతోంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే టాప్ హీరోగా పేరున్న వెంకటేష్ ప్రస్తుతం ఏవర్గ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. లేటెస్ట్ గా విడుదలైన బాలీవుడ్ మూవీ ‘కిసీ కా బాయ్ కిసీ కి జాన్’ మూవీలో పూజా హెగ్డే అన్నయ్యగా వెంకటేష్ ఎందుకు నటించాడు అన్నవిషయం ఎవరికీ అర్థం కావడంలేదు. ఆసినిమాలో అతడి పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేదు.
ఆమధ్య విశ్వక్ సేన్ తో కలిసి ‘ఓరిదేవుడో’ సినిమాలో కనిపించినప్పుడు వెంకీ ఇలాంటి ప్రాధాన్యత లేని సినిమాలలో ఎందుకు నటిస్తున్నాడు అంటు చాలామంది షాక్ అయ్యారు. ఇక నెట్ ఫ్లిక్స్ లో ఆమధ్య స్ట్రీమ్ అయిన ‘రానాయుడు’ వెబ్ సిరీస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వెబ్ సిరీస్ లోని బూతులు విని చాలామంది తట్టుకోలేకపోయారు.
ప్రస్తుతం వెంకీ శైలేష్ కొలన్ దర్శకత్వంలో ‘సైంధవ్’ అన్న సినిమాను చేస్తున్నాడు ఈమూవీ పూర్తిగా యాక్షన్ మూవీ. వెంకీ ఇమేజ్ కి ఈసినిమా సరిపోతుందా అన్నసందేహాలు కూడ ఉన్నాయి. 60 సంవత్సరాల వయసులో ఉన్న వెంకటేష్ తన వయస్సుకు తగ్గ గంభీరమైన పాత్రలు పోషిస్తే బాగుంటుంది అంటు సూచనలు వస్తున్నాయి.
వెంకటేష్ తన 75వ సినిమాను ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్నో కథలు వింటున్నప్పటికీ అతడికి నచ్చిన కథ ఇప్పటివరకు దొరకలేదు అని అంటారు. దీనితో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వెంకటేష్ వాస్తవ దృష్టితో ఆలోచించి. మంచి కథలు ఎంచుకుంటే బాగుంటుంది అంటూ సూచనలు వస్తున్నాయి. వాస్తవానికి ఇదే సమస్యలు నాగార్జునను కూడ వెంటాడుతున్నాయి. సీనియర్ హీరోలలో చిరంజీవి బాలకృష్ణలు మినహా నేటితరం ప్రేక్షకులతో కనెక్ట్ కాలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో వెంకీ భవిష్యత్ సినిమాలు ఎలా ఉంటాయి అంటూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..